LIVE : విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - YOGANDRA 2025 LIVE
🎬 Watch Now: Feature Video


Published : June 21, 2025 at 6:47 AM IST
|Updated : June 21, 2025 at 8:03 AM IST
1 Min Read
Yogandra 2025 Live : అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ విశాఖ సాగరతీరం జనసంద్రంగా మారింది. తెల్లవారుజామునుంచే ప్రజల రాకతో ఆర్కే బీచ్ సముద్రం ఉప్పెన పొంగిందా అన్నట్లు మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదికైంది. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. యోగా డేలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు జాదవ్ ప్రతాప్‌రావు, రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ముందు ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద 15 వేల మందితో కలిసి మోదీ యోగా చేయనున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేస్తూ 'యోగా ఫర్ వన్ ఎర్త్ - వన్ హెల్త్' నినాదాలు చేస్తున్నారు. విశాఖ యోగా డేకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచే యోగాంధ్ర కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొన్నారు. సూరత్‌లో లక్షా 47వేల 952 మందితో చేసిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. ప్రాంగణంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకున్న వారినే అధికారులు లెక్కిస్తున్నారు. రెండు గిన్నిస్ బుక్ రికార్డులు లక్ష్యంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : June 21, 2025 at 8:03 AM IST