నాగార్జునసాగర్​లో 22 గేట్లు ఓపెన్​ - మొదలైన పర్యాటకుల సందడి - Huge Tourist at NagarjunaSagar

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 4:16 PM IST

thumbnail
నాగార్జున సాగర్​లో 22 గేట్లు ఓపెన్​ - మొదలైన పర్యాటకుల సందడి (ETV Bharat)

Huge Tourist at Nagarjuna Sagar : నాగార్జునసాగర్​ ప్రాజెక్టు 22 గేట్లను అధికారులు మంగళవారం తెరిచారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్​ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్​ జామ్​ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్​ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ మొబైల్​ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఇలా సాగర్​ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు. 

ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి సాగర్​కు చేరుకుంటున్నారు. జల సందడితో కూడిన సాగర్ డ్యాంను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు, ఎల్లుండి కూడా జలాశయం వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.