LIVE : ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి పోటెత్తిన భక్తులు - devotees rush at Khairatabad Ganesh
Published : Sep 15, 2024, 10:50 AM IST
|Updated : Sep 15, 2024, 1:43 PM IST
Devotees Rush at Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు ఆదివారం కావడంతో భారీ గణపయ్యను కనులారా దర్శించుకోవాలని ఖైరతాబాద్కి బారులు తీరుతున్నారు. దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తుల రద్దీతో సందడిగా మారింది. జై గణేశా.. జైజై గణేశా నినాదాలతో ఖైరతాబాద్ గణేశ్ మండప ప్రాంతం మార్మోగిపోతుంది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. 70 అడుగుల మహా గణపతిని చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నవరాత్రులు అన్ని రోజులు ఖైరతాబాద్ గణేశుడిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ వంతెన, సచివాలయం, పీపుల్స్ ప్లాజా పరిసర ప్రాంతాల రహదారులు తెల్లవారుజాము వరకు భారీగా ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయాయి. మరోపక్క 8వ రోజు కావడంతో ట్యాంక్ బండ్పై గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టాయి. పోలీసులు దగ్గర ఉండి ఒక్కొక్క వినాయకుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయిస్తున్నారు.
Last Updated : Sep 15, 2024, 1:43 PM IST