తప్పుడు పత్రాలతో మా భూములు లాక్కున్నారు -​ ప్రజాదర్బార్​లో వల్లభనేని వంశీ బాధితులు - Complaints on Vallabhaneni Vamsi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 7:42 PM IST

thumbnail
ప్రజాదర్బార్​కు పోటెత్తిన వల్లభనేని వంశీ బాధితులు (ETV Bharat)

Huge Complaints on Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అతని అనుచరుల అరాచకాలకు గురైన బాధితులు ప్రజాదర్బార్​కు పోటెత్తారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ బాలాజీలకు వైఎస్సార్సీపీ నేత వంశీ, అతని అనుచరులపై బాధితులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. చెరువులు, మట్టి తవ్వకాల్లో వంశీ భారీ అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీలకు ఇచ్చిన భూముల్ని సైతం దౌర్జన్యంగా లాక్కున్నారని ఫిర్యాదులిచ్చారు. 

స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. వంశీ అనుచరులు తమ భూములను దౌర్జన్యం చేసి తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని బాధితులు ఫిర్యాదులో వెల్లడించారు. సత్వరమే వాటిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని భాదితుల విన్నవించారు. అదే విధంగా గన్నవరం పార్టీ ఆఫీసుపై దాడి చేసి, కార్యకర్తలపై ఆక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చిన్నఅవుటపల్లి ఎస్​ఎం కన్వెన్షన్​లో  ప్రజాదర్బార్‌ నిర్వహించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.