చెత్త కాగితాల దుకాణంలో పాఠ్యపుస్తకాలు- డబ్బుల కక్కుర్తితో అమ్మినట్లు ఆరోపణలు - Govt textbooks In Scrap shop

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 2:08 PM IST

thumbnail
చెత్త కాగితాల దుకాణంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు- డబ్బుల కక్కూర్తితో అమ్మినట్లు ఆరోపణలు (ETV Bharat)

Govt Textbooks In Scrap Shop : పాఠశాలలో ఉండాల్సిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు చెత్తకాగితాలు విక్రయించే డంపింగ్​ దుకాణంలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో జరిగింది. నియోజకవర్గంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో పంపిణీ చేయాల్సిన పుస్తకాలు బహిరంగ మార్కెట్లో కనిపించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి విద్యార్థులకు పంపిణీ చేయకుండా స్క్రాప్‌ కింద విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు.  

ఈ వ్యవహారం స్థానికుల దృష్టికి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పుస్తకాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా సొమ్ము చేసుకునేందుకు యత్నించిన గిరిజన సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల విద్యార్థుల చేతుల్లో ఉండాల్సిన పుస్తకాలు ఇలా డంపింగ్​లో ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ప్రతిఏటా ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యపుస్తకాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ముద్రిస్తుంటే కొంతమంది నిర్వాకం వల్ల ఇలా పక్కదారి పట్టడం విమర్శలకు తావిస్తోంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.