సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి- తిరుమలలో వైభవంగా గరుడ పంచమి సేవ - Garuda Panchami Seva in Tirumala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 11:20 AM IST
Garuda Panchami Seva in Tirumala : తిరుమలలో వైభవంగా గరుడ పంచమి సేవ నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుత్మంతునిపై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పంచమి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వాహన సేవలో పాల్గొన్న భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు, నైవేథ్యాలు సమర్పించారు. వాహనసేవలో జస్టిస్ శ్యామ్ సుందర్ దంపతులు పాల్గొన్నారు. గోవింద నామస్మమరణలతో శ్రీవారి మాడ వీధులు మార్మోగాయి.
గరుడ పంచమి సందర్భంగా విశాఖలోని సింహాచలం పుణ్య క్షేత్రంలో సింహాద్రి అప్పన్నకు వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని మండపంలో అధిష్టింప చేశారు. అర్చకులు వేకువ జామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సంప్రదాయ బద్దంగా ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి సన్నిధిలో వైభవంగా నిర్వహించిన అర్జిత సేవా కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆలయ పండితులు సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వేదికపై అధిష్టింపజేశారు.