thumbnail

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - Venkaiah Visited Khairatabad Ganesh

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 1:42 PM IST

Ex Vice President Venkaiah Naidu Visited Khairatabad Ganesh : దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గణేశున్ని కోరుకున్నట్లు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇవాళ ఉదయం ఖైరతాబాద్​ గణేశ్​ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజలు అనంతరం పండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రజలందరం ధర్మబద్ధంగా నడవాలని, ధర్మ నిరతిని కాపాడాలని వెంకయ్య నాయుడు అన్నారు. ఖైరతాబాద్​ గణేశ్​ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలని దేవుడిని కోరుతున్నట్లు చెప్పారు.సెప్టెంబరు 7వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తొలి పూజను చేసిన సీఎం రేవంత్​ రెడ్డి, ఆతర్వాత గవర్నర్​ జిష్ణుదేవ్​ శర్మ, కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​, రాష్ట్ర మంత్రులు ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్నారు. ఈసారి 70 అడుగుల గణేశుడిని ఖైరతాబాద్​లో ప్రతిష్ఠించారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్​లో గణేశుడిని తీసుకువస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.