వైరల్ వీడియో : మల్లారెడ్డి బతుకమ్మ డ్యాన్స్ - మీరూ చూడండి - Malla Reddy Dance with Students
🎬 Watch Now: Feature Video
Malla Reddy Dance with Students : పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్ వింటే వెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి మల్లారెడ్డియే. సాధాణంగా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి ఏం చేసినా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఆయన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ వేశారు. దసరా వేడుకల్లో భాగంగా ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేక దుస్తుల్లో హాజరైన విద్యార్థినులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు విద్యార్థినిలతో కలసి ఆడి పాడారు. ప్రతి ఏటా మల్లారెడ్డి యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, కళాశాల హాస్టళ్లలో ఉండే విద్యార్ధినులకు తమకు ఇంటి వద్ద లేని లోటు రాని విధంగా అన్ని హంగులతో సంబరాలు చేసుకుంటామని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తెలిపింది.