thumbnail

LIVE : చెన్నైలో 'దేవర' మూవీ టీమ్​ ప్రెస్​మీట్​ - ప్రత్యక్షప్రసారం - Devara Movie Team Press meet Live

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 7:32 PM IST

Updated : Sep 17, 2024, 8:07 PM IST

Devara Movie Team Press Meet in Chennai Live : పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. సెప్టెంబరు 27న గ్రాండ్​గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్​లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్​ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో తారక్​ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్​కు తెగ నచ్చేశాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూవీటీమ్​ మరో ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.అయితే ఈ సారి విడుదల చేయనున్న ట్రైలర్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్​కే కాదు అందరికీ నచ్చేలా మరింత పవర్ ఫుల్​గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబరు 22న హైదరాబాద్​లో జరగనున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఈ రెండో ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్​గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర బృందం చెన్నైలో సందడి చేస్తొంది. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యక్షప్రసారం.
Last Updated : Sep 17, 2024, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.