జవహితమే ఈనాడు దినపత్రిక లక్ష్యం: పవన్ కల్యాణ్ - Pawan congratulated to eenadu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 9:34 PM IST

thumbnail
ఈనాడు దినపత్రిక 50 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది : పవన్ కల్యాణ్ (ETV Bharat)

Deputy CM Pawan Kalyan Congratulated to Eenadu : జనహితమే ఈనాడు దినపత్రిక లక్ష్యమని అందుకే 50 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని నిలబడిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ సాగర తీరంలో ఆవిర్భవించిన ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకోవటం సంతోషంగా ఉందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యానికి, పాత్రికేయులకు, ఇతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పత్రిక ప్రారంభించిన నాటి నుంచి విలువలు, విశ్వసనీయత కవచాలుగా పత్రికకు తొడిగి ప్రజాపక్షం వహిస్తూ కలం పోరు సాగించటాన్ని ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు అందరికీ అలవాటు చేశారని ప్రశంసించారు. ప్రజలకు వేగంగా సమాచారం అందించటమే కాకుండా ప్రజాచైతన్యం కలిగించే వార్తలు ఉండాలన్న రామోజీరావు ఆలోచనతో పత్రిక ప్రజలకు చేరువైందన్నారు.

ఈనాడు పత్రిక తరపున సమాజానికి మేలు కలిగించే కార్యక్రమాలను ఉద్యమ రూపంలో చేపట్టారని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండే విషయంలో ఈనాడు యాజమాన్యం ఎప్పుడూ ముందున్నదన్నారు. భారీ విరాళాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. తన మానస పుత్రిక ఈనాడు స్వర్ణోత్సవాల్ని రామోజీరావు కనులారా చూసుకుని ఉంటే ఆయన ఎంతో సంబరపడేవారన్నారు. ఆయన కొద్ది నెలల క్రితం ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయినా ఆయన అందించిన విలువలు, క్రమశిక్షణతో ఈనాడు పత్రికను ఎండీ కిరణ్, ఇతర సంపాదకవర్గం ముందుకు తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.