LIVE : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - ప్రత్యక్షప్రసారం - TELANGANA INTER RESULTS 2025

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : April 22, 2025 at 12:02 PM IST

Updated : April 22, 2025 at 12:44 PM IST

1 Min Read
Telangana Inter Results 2025 Released : తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాలను  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలు రాయాలని మంత్రి చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in, results.eenadu.net, వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగ్గా, దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్​ నిర్వహించారు. విద్యార్థులు tgbie.cgg.gov.in  వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి తమ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.
Last Updated : April 22, 2025 at 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.