బొజ్జ గణపయ్యకు 'కాకి' పూజలు - వైరల్ అవుతున్న వీడియో - Crow on Ganapati idol In Suryapet
🎬 Watch Now: Feature Video
Crow on Ganapati idol In Suryapet : విఘ్నాలు తొలగించే వినాయకుడి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ గణనాథుల మండపాల ఏర్పాట్లలో నిమగ్నమైపోతారు. సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గణపతి విగ్రహంపై కాకి కూర్చుని పూజ చేసినట్టుగా ఉన్న దృశ్యం తారసపడింది. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
ముద్దిరాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పర్యావరణం కాపాడేందుకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ప్రాజెక్ట్ పనులు ఇచ్చారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ప్రాజెక్ట్ పనిలో భాగంగా విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసుకొని వచ్చారు. మంగళవారం ఉదయం తరగతి గదిలో ఉంచిన మట్టి గణపతి విగ్రహాల వద్దకు ఓ కాకి వచ్చి విగ్రహం పైనే కూర్చొని ఉంది. ఈ దృశ్యం కాకి వినాయకుడికి పూజ చేస్తున్నట్లుగా ఉందని సంబరపడ్డారు. చాలా సమయం విగ్రహంపై కాకి కూర్చొని ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.