సెల్ఫీ వీడియోలో పారిశుద్ధ్య కార్మికుడి ఆత్మహత్యాయత్నం - Mancherial Worker Suicide Attempt
Published : Aug 12, 2024, 5:29 PM IST
Municipality Worker Attempted Suicide in Mancherial : మంచిర్యాలలోని పురపాలక సంఘంలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. తన చావుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సెల్‌ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. పట్టణంలోని కౌన్సిలర్, మున్సిపల్ కార్మిక నాయకుడు సుద్దమల్ల హరికృష్ణ తమకు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేశాడని బాధితుడు ఆరోపించాడు.
ఒప్పంద కార్మికులను మున్సిపాలిటీలో పర్మినెంట్ నియామకం కోసం ఒక్కొక్కరి నుంచి 50 వేల రూపాయలు తమ నుంచి కౌన్సిలర్ వసూలు చేశాడని కార్మికుడు నవీన్ వాపోయాడు. మోసపోయానని గ్రహించిన నవీన్ మనస్తాపం చెంది సెల్ఫీ వీడయో తీస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదంటూ హరికృష్ణ మాట మార్చాడని బాధితుడు వాపోయాడు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐ తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదని, కానీ హరికృష్ణ ఫిర్యాదుతో తనపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.