LIVE : భూభారతి పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - BHUBHARATI PORTAL LAUNCHES
🎬 Watch Now: Feature Video


Published : April 14, 2025 at 7:03 PM IST
|Updated : April 14, 2025 at 8:31 PM IST
1 Min Read
CM Revanth Reddy Launches Bhubharati Portal : రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్‌ను ప్రారంభించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మూడు మండలాల్లో దీనిని అమలు చేయనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ధరణి పోర్టల్‌కు బదులుగా తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని సీఎం ఇప్పటికే అధికారులను సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. శిల్పకళావేదికలో జరుగుతున్న ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.
Last Updated : April 14, 2025 at 8:31 PM IST