LIVE : షాద్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
🎬 Watch Now: Feature Video
CM Revanth Laid Foundation Stone for Integrated School : యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ నిర్మాణ పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో సుమారు రూ.12 వేల కోట్లను ఖర్చు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తొలి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు.
Last Updated : Oct 11, 2024, 4:09 PM IST