LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - PONNAM PRABHAKAR ON BC BILL
🎬 Watch Now: Feature Video

Published : March 17, 2025 at 10:07 AM IST
|Updated : March 17, 2025 at 4:01 PM IST
1 Min Read
CM Revanth in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నేడు శాసన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్ట నుండగా, బీసీ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభ ముందుకు తీసుకురానున్నారు. వీటితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవాలయాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. మొన్నటి ఆఖరు సమావేశంలో శాసన సభ వేడి వేడిగా నడిచింది. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ శాసన సభ్యుడు జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను సస్పెండ్ చేయడం, దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ లాంటి నిరసన తెలపడం రాజకీయంగా కొంత గరం గరం అయ్యింది. నేడు ఈ బిల్లులపై మాట్లాడే అవకాశాన్ని బీఆర్‌ఎస్ ఎలా ఉపయోగించుకుంటుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది
Last Updated : March 17, 2025 at 4:01 PM IST