LIVE : సరస్వతి నది పుష్కర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - SARASWATI PUSHKARALU LIVE
🎬 Watch Now: Feature Video


Published : May 15, 2025 at 5:38 PM IST
|Updated : May 15, 2025 at 8:47 PM IST
1 Min Read
Saraswati Pushkaralu Live : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సరస్వతి పుష్కరాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్‌లో 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్నారు. తరువాత సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతో పాటు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి పర్యటనను ప్రత్యక్ష ప్రసారం ద్వాారా చూద్దాం.
Last Updated : May 15, 2025 at 8:47 PM IST