తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth On Qutb Shahi tombs

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 6:17 PM IST

thumbnail
తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుంది : సీఎం రేవంత్​ (CM Revanth On Qutb Shahi Heritage Park)

CM Revanth On Qutb Shahi Heritage Park : రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సగర్వంగా ఉంచుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, సెవెన్ టూంబ్స్ నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో నిర్వహించిన అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి, ఎంపీ అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అక్కడ మొక్కనాటి హరిత స్ఫూర్తిని చాటారు

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్​ శాతవాహనలు, కాకతీయులు, కుతుబ్​షాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారన్నారు. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్ర వేశారని ఆయన తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. '2013లో కుత్‌బ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ రాష్ట్రసాంస్కృతిక శాఖతో కలిసి చేపట్టింది. 2013లో ఎంఓయూ ప్రారంభించి, 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనం' అని సీఎం కొనియాడారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.