LIVE: పొన్నేకల్లులో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU VISIT TO PONNEKALLU
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : April 14, 2025 at 12:33 PM IST
|Updated : April 14, 2025 at 2:52 PM IST
1 Min Read
CM Chandrababu Naidu Visit to Ponnekallu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటిస్తున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు పొన్నేకల్లు చేరుకున్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి సీఎం నివాళులర్పించనున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా రుణాలు పొంది విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఎంపీపీ పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 కార్యాక్రమంలో పాల్గొంటారు. మార్గదర్శి- బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశమవుతారు. అనంతరం భోజన విరామం తీసుకుని ఆ తరువాత పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి చేరుకుంటారు. ప్రస్తుతం పొన్నేకల్లులో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : April 14, 2025 at 2:52 PM IST