LIVE : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU KONASEEMA TOUR LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2025 at 1:15 PM IST
|Updated : May 31, 2025 at 3:53 PM IST
1 Min Read
CM Chandrababu Konaseema District Tour Live : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. హెలికాఫ్టర్‌లో జిల్లాకు చేరుకున్న సీఎం మొదట చెయ్యేరులో ‘పేదల సేవలో’కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న చెరువు పనులను పరిశీలించి, శ్రామికులతో ముచ్చటించారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. తర్వాత ప్రజావేదిక వద్దకు చేరుకొని స్థానికులతో సమావేశమయ్యారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీహెచ్ గున్నేపల్లి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశమవనున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు తిరిగి ఉండవల్లి పయనమవుతారు. హెలిప్యాడ్, సభాప్రాంగణం, ఇతర ప్రాంతాలను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ కృష్ణారావులు పరిశీలించారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
Last Updated : May 31, 2025 at 3:53 PM IST