LIVE : బీఆర్ఎస్ఎల్పీలో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం - BRS Leaders press meet live
Published : Aug 3, 2024, 1:10 PM IST
|Updated : Aug 3, 2024, 2:18 PM IST
BRS Leaders Press Meet Live : బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం శాసనసభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌పై విమర్శలు గుప్పించారు. క్యాలెండర్లో ఉద్యోగాలు ఉన్నాయి తప్ప వాటి సంఖ్య లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు యువతను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పుడు ఎన్ని పోస్టులో లేకుండా విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభలో అలా మాట్లాడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Last Updated : Aug 3, 2024, 2:18 PM IST