LIVE : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మీడియా సమావేశం - MLA Arikapudi Gandhi House live
Published : Sep 13, 2024, 10:03 AM IST
|Updated : Sep 13, 2024, 4:10 PM IST
BRS leaders meet at the residence of MLA Arekapudi Gandhi live : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ పరస్పర సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు భేటీ నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ భేటీగా బీఆర్ఎస్ తెలిపింది. శంభీపూర్ రాజు ఇంటి నుంచి నేతలు బయల్దేరారని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బాలానగర్ డీసీపీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్, హైదర్‌నగర్‌లో బీఆర్ఎస్ నేతలు గృహ నిర్బంధించారు. శంభీపూర్ రాజు ఇంటి వద్దకు నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.
Last Updated : Sep 13, 2024, 4:10 PM IST