ఒక్కసారిగా కూలిన వంతెన- వీడియో చూశారా? - Bridge Collapse In Karnataka

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 2:10 PM IST

Updated : Aug 7, 2024, 3:11 PM IST

thumbnail
కర్ణాటకలో అకస్మాత్తుగా కూలిన వంతెన - వీడియో చూశారా! (ANI, ETV Bharat)

Bridge Collapse In Karnataka : కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ నది మీద ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రిడ్జి కూలింది. దీనితో ట్రక్కు నదిలో పడిపోగా, డ్రైవర్‌ను మత్స్యకారులు రక్షించారు. అనంతరం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఈ ప్రమాదం రాత్రివేళ కాకుండా తెల్లవారు జామున జరిగి ఉంటే నష్టం భారీగా ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వంతెన పాతది కావడం వల్లే అది కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గోవా, కర్ణాటక మధ్య ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా ఇన్నాళ్లు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇది ధ్వంసం కావడం వల్ల గోవా, కర్ణాటక జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో అదే నదిపై ఉన్న కొత్త వంతెనను ప్రారంభించి, ఆంక్షలతో వాహనాలను అనుమతించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Last Updated : Aug 7, 2024, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.