రాత్రిపూట 20సింహాలు సంచారం- వీడియో వైరల్​ - FAMILY OF 20 LIONS ROAMING IN NIGHT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : June 6, 2025 at 3:45 PM IST

1 Min Read

Family of 20 Lions Roaming in Night : గుజరాత్​ భావ్​నగర్​లో 20 సింహాలతో కూడిన కుటుంబం కనిపించింది. ఇందులో మగ, ఆడ సింహాలతో పాటు పిల్లలు సైతం కనిపించాయి. రాత్రి సమయంలో సంచరిస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోను అటవీ అధికారులు సైతం ధ్రువీకరించారు.  

భావ్​నగర్​ జిల్లాలోని పాలితానా శెత్రూంజి డ్యామ్​ పరిసర ప్రాంతాల్లో సింహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 20 సింహాలతో కూడిన ఓ కుటుంబం ఇక్కడ ఉంటున్నట్లు తాజా గణనలో తేలింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో ఆహారం కోసం సంచరిస్తుంటాయి. ఇటీవలె ఒకరోజు రాత్రి ఆహారం కోసం బయటకు రాగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మరోవైపు ఈ వీడియో వైరల్​గా మారడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. 20 సింహాలతో కూడిన కుటుంబం తిరుగుతున్నట్లు ధ్రువీకరించారు. వైరల్​గా మారిన వీడియో ఫేక్​ కాదని, నెలన్నర క్రితం నాటిదని చెప్పారు. ఆ సింహాల బాగోగులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, వాటిని సురక్షితంగా ఉంచుతామని తెలిపారు. సింహాలు ఎక్కడ ఉన్నాయి? ఎటు వైపు వెళ్తున్నాయి? లాంటి విషయాలను ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.