చిట్టిచేతులు పెద్ద సాయం చేశాయి - వీడియోను పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు - AP CM On Students Donation
Published : Sep 9, 2024, 6:15 PM IST
|Updated : Sep 9, 2024, 6:33 PM IST
AP CM Chandrababu Naidu On Students Donation : చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాల చిన్నారుల వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా చిన్నారులు అసాధారణ కరుణ ప్రదర్శించారని ప్రశంసించారు. విద్యార్థుల్లో ఇలాంటి విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహిస్తూ, ప్రాముఖ్యతను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఇటువంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయని సీఎం స్పష్టం చేశారు.
జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఆహారం, సామగ్రి, డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో తమవంతుగా సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి ఆరు రోజులు దాటినా ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్ల పరిస్థితి మెరుగుపడిందని అనుకునేలోపు క్రమంగా నీరు పెరుగుతోంది.