LIVE: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - PAWAN KALYAN LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : April 8, 2025 at 6:47 PM IST
|Updated : April 8, 2025 at 6:58 PM IST
1 Min Read
LIVE: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం పవన్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉండగా సింగపూర్‌లో తన కుమారుడు స్కూల్లో అగ్నిప్రమాదానికి గురైనట్లు సమాచారం వచ్చింది. పార్టీ నేతలు, అధికారులు వెంటనే వెళ్లాలని పవన్‌కు సూచించినప్పటీకీ గిరిజనులతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సమావేశం ముగిసిన తర్వాతే వెళ్తానని పవన్ తెలిపారు. అల్లూరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంా డుంబ్రిగుడ మండలంలోని కురిడి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులతో కలసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్‌కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆ తర్వాత గిరిజనుల కోరిక మేరకు కురిడి గ్రామాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. అక్కడ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : April 8, 2025 at 6:58 PM IST