శిశువును రోడ్డుపై వదిలేసిన తల్లిదండ్రులు- బాపట్ల జిల్లాలో అమానుష ఘటన - A Baby Girl Abandoned in Bapatla

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 1:13 PM IST

thumbnail
ఏల్చూరులో 4 రోజుల ఆడశిశువును వదిలేసిన గుర్తు తెలియని తల్లిదండ్రులు (ETV Bharat)

A Baby Girl Abandoned in Bapatla : బిడ్డ పుట్టిందంటే సహజంగా చాలా మంది తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. దీనికి భిన్నంగా అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఓ చిన్నారిని మానవత్వం మరిచిన ఓ పేరెంట్స్ దర్గా దగ్గర వదిలి వెళ్లారు. స్థానికులు ఆ పసిపాప ఏడుపు విని కాపాడి సంరక్షించారు. బాపట్ల జిల్లాలో ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సంతమాగులూరు మండలం ఏల్చూరులో దర్గా వద్ద నాలుగు రోజుల క్రితం ఓ ఆడశిశువును వదిలి వెళ్లారు. ఆడపిల్లను భారంగా భావించి అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని తల్లిదండ్రులు పసి పాపను వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు కాపాడి ఈ విషయాన్ని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది శిశువును సంరక్షించారు. అనంతరం ఆ బిడ్డను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాపను ఒంగోలులోని చైల్డ్ హుడ్‌ కేంద్రానికి తరలిస్తునట్లు అంగన్వాడీలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.