Zomato Labs Introduces Nugget: వ్యాపారాల కోసం జొమాటో ల్యాబ్స్ 'నగ్గెట్' పేరుతో సరికొత్త AI ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని జొమాటో-పేరెంట్ ఎటర్నల్ CEO దీపిందర్ గోయల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. అందులో ఈ కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్ 80శాతం క్వెరీస్‌ను పరిష్కరించిందని పేర్కొన్నారు. అంతేకాక ఎటువంటి డెవలపర్ టీమ్ లేదా కఠినమైన వర్క్‌ఫ్లోస్ లేకుండా అత్యంత కస్టమైజబుల్ అండ్ లో-కాస్ట్ టూల్‌గా దీన్ని ఆయన అభివర్ణించారు.
"నెగ్గెట్ అనేది ఏఐ-నేటివ్, నో-కోడ్ కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫారమ్. ఇది మా ఇన్-హౌస్ ఇన్నోవేషన్స్‌కు ఇంక్యుబేటర్ అయిన జొమాటో ల్యాబ్స్ నుంచి వచ్చిన మొదటి ప్రొడక్ట్. ఇది మాత్రమే కాక కంపెనీ త్వరలో మరింత ఎక్సైటింగ్ లాంఛెస్ను ప్రకటించనుంది." - దీపిందర్ గోయల్, జొమాటో ఫౌండర్, సీఈవో
జొమాటో నుంచి నగ్గెట్: బిజినెస్ స్కేల్ సపోర్ట్‌ను పెంచడంలో సహాయపడే సాధనంగా ఈ కొత్త కస్టమర్ సపోర్ట్ ఏఐ ప్లాట్‌ఫామ్ 'నగ్గెట్'ను దీపిందర్ గోయల్ ప్రకటించారు. ఈ ప్లాట్‌ఫామ్ 80 శాతం వరకు క్వెరీస్‌ను స్వయంప్రతిపత్తి (Autonomously)తో పరిష్కరిస్తుందని, ఇది రియల్‌టైమ్‌లోనే నేర్చుకుని అనుకూలీకరిస్తుందని, ఇందుకోసం కోడింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదని గోయల్ పేర్కొన్నారు.
ఈ ప్లాట్‌ఫారమ్ ఫీచర్స్:
- క్వెరీల (Question, Inquiry, or Search for Information)ను స్వయంప్రతిపత్తిగా పరిష్కరించేందుకు 'AI ఏజెంట్స్ అండ్ వర్క్‌ఫ్లోస్'
- కన్వర్జేషనల్ బాట్‌ల ద్వారా 24/7 సపోర్ట్ కోసం 'లైవ్ చాట్ అండ్ కాల్స్'
- ఎఫిషియన్సీ కోసం 'టికెటింగ్ సిస్టమ్'
- అన్ని ఇంటరాక్షన్స్‌లో ఇన్సైట్స్ను అందించేందుకు 'క్వాలిటీ ఆడిట్ టూల్'
మూడు సంవత్సరాలకు పైగా ఇంటర్నల్ టూల్‌గా ఈ 'నగ్గెట్'ను బిల్డ్ చేసినట్లు గోయల్ తెలిపారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇది జొమాటో, బ్లింకిట్, హైపర్‌ప్యూర్‌లకు నెలకు 15 మిలియన్లకు పైగా సపోర్ట్ ఇంటరాక్షన్స్కు పవర్ ఇస్తుందని పేర్కొన్నారు.
🚀 Introducing Nugget—an AI-native, no-code customer support platform.
— Deepinder Goyal (@deepigoyal) February 17, 2025
Nugget helps businesses scale support effortlessly—highly customizable, low-cost, no dev team needed. No rigid workflows, just seamless automation.
✅ Resolves up to 80% of queries autonomously
✅ Learns &… pic.twitter.com/pnVrUEhmcd
దీంతోపాటు నగ్గెట్‌ను చూసిన 90 శాతం కంపెనీలు ఇప్పటికే సైన్ అప్ చేసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో దీని యాక్సెస్ కోసం nugget.zomato.com లింక్‌ను అందించారు. ఈ వెబ్‌సైట్ కంపెనీని సంప్రదించడానికి ఒక ఫారమ్‌తో పాటు ప్లాట్‌ఫామ్ సామర్థ్యాల గురించి క్లుప్తంగా తెలియజేస్తుందని వివరించారు.
"ఈ నెగ్గెట్ ప్లాట్‌ఫామ్ 99.99 శాతం అప్‌టైమ్‌ను కలిగి ఉంది. దీని AI ఏజెంట్లు 80 శాతం క్వెరీలను పరిష్కరించాయి. ఈ టూల్ ఏజెంట్ కో-పైలట్‌తో 25శాతం మెరుగైన కంప్లైయన్స్‌ను, హ్యూమన్ ఏజెంట్ సామర్థ్యంలో 20 శాతం మెరుగుదలను అందిస్తుంది." - దీపిందర్ గోయల్, జొమాటో ఫౌండర్, సీఈవో
కంపెనీ దీని ధరను బహిరంగంగా ప్రకటించలేదు. అయితే లెగసీ ప్రొవైడర్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న వ్యవస్థాపకులకు నగ్గెట్‌ను ఉచితంగా అందిస్తోందని సమాచారం.
సముద్ర గర్భంలోకి మనుషులు- 6వేల మీటర్ల లోతులో పరిశోధన- 'మత్స్య-6000' టెస్ట్ సక్సెస్
అధునాతన టెక్నాలజీతో 'BYD సీలియన్ 7' SUV లాంఛ్- సింగిల్ ఛార్జ్‌తో 567 కి.మీ రేంజ్!