ETV Bharat / technology

వరల్డ్ ఫస్ట్ ట్రై ఫోల్డ్ మొబైల్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - First Tri Foldable Smartphone

Worlds First Tri Foldable Smartphone: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్టబుల్ స్మార్ట్​ఫోన్​ను హువావే కంపెనీ లాంచ్ చేసింది. హువావే మేట్‌ ఎక్స్‌టీ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్​ఫోన్ విశేషాలు, ధర, ఫీచర్లు గురించి తెలుసుకుందాం రండి.

author img

By ETV Bharat Tech Team

Published : Sep 16, 2024, 12:38 PM IST

Worlds_First_Tri_Foldable_Smartphone
Worlds_First_Tri_Foldable_Smartphone (Huawei)

Worlds First Tri Foldable Smartphone: టెక్ మార్కెట్లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రకం ప్రొడక్ట్స్​ను విడుదల చేయాలి. దీంతో ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థలు కొత్త తరహా మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్​దే హవా. మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్​కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ తరహా స్మార్ట్​ఫోన్లపై అనేక సంస్థలు ఫోకస్ చేశాయి.

కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా వీటిని రూపొందించి మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​ను చైనాలో హువావే లాంచ్ చేసింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్డబుల్‌ ఫోన్‌ లాంచ్‌ చేసిన కంపెనీగా హువావే అవతరించింది. సెప్టెంబర్ 20 నుంచి ఈ ట్రై పోల్డ్ మొబైల్స్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లుపై ఓ లుక్కేద్దామా?

Huawei Mate XT Features:

  • డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ
  • అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు డ్యూయల్‌ స్క్రీన్‌: 7.9 అంగుళాలు
  • ట్రిపుల్‌ స్క్రీన్‌ ఓపెన్‌ చేస్తే డిస్‌ప్లే: 10.2 అంగుళాలు
  • పూర్తిగా అన్‌ఫోల్డ్‌ చేశాక ఈ ఫోన్‌ మందం: 3.6ఎంఎం
  • ప్రాసెసర్‌: కిరిన్‌ 9 సిరీస్‌
  • మెయిన్‌ కెమెరా: 50 ఎంపీ
  • యాంగిల్‌ కెమెరా: 12 ఎంపీ అల్ట్రా వైడ్‌
  • టెలీఫొటో లెన్స్‌: 12 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ
  • బ్యాటరీ: 5,600ఎంఏహెచ్‌
  • 66W వైర్డ్‌ ఛార్జింగ్‌
  • 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

వేరియంట్స్:

  • 16జీబీ+256జీబీ వేరియంట్‌
  • 512 స్టోరేజీ వేరియంట్‌
  • 1టీబీ వేరియంట్‌

ధరలు:

  • 16జీబీ+256జీబీ వేరియంట్‌ ధర: 19,999 యువాన్లు
  • 512 స్టోరేజీ వేరియంట్‌ ధర: 21,999 యువాన్లు
  • 1టీబీ వేరియంట్‌ ధర: 23,999 యువాన్లు

ఇండియన్ కరెన్సీ ప్రకారం ధరలు:

  • 16జీబీ+256జీబీ వేరియంట్‌ ధర: రూ.2.35 లక్షలు
  • 512 స్టోరేజీ వేరియంట్‌ ధర: రూ.2.59 లక్షలు
  • 1టీబీ వేరియంట్‌ ధర: రూ.2.83 లక్షలు

అయితే భారత్‌ గానీ, ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో గానీ హువావే మేట్‌ ఎక్స్‌టీ ఫోన్‌ లాంచ్‌ చేసే అవకాశం లేదని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా టెక్నో సంస్థ కూడా ఈ తరహా ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే దీని ఫస్ట్ లుక్​ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ను ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ముగిసేలోగా టెక్నో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు టెక్ నిపుణులు అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.