ETV Bharat / technology

వీడియో కాల్​ లైవ్​లోనే ఫిల్టర్స్, మేకప్​​ టచ్! నయా వాట్సాప్ ఫీచర్​తో మనుషుల్ని గుర్తుపట్టడం కష్టమే! - WhatsApp Video Calls New Features

WhatsApp Video Calls New Features : వాట్సాప్‌ వీడియో కాల్స్‌లో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిని వాడుకొని మనం ఎంజాయ్ చేస్తూ కాల్స్ మాట్లాడొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్స్‌పై వివరాలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 5:42 PM IST

WhatsApp Video Calls New Features
WhatsApp Video Calls New Features (Getty Images)

WhatsApp Video Calls New Features : వాట్సాప్‌ వీడియో కాల్స్ మరింత హైటెక్ లుక్‌ను సంతరించుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. వీడియో కాల్స్‌ లుకింగ్‌ను మన ఇష్టానుసారంగా మార్చేందుకు అనుమతించే కొత్తకొత్త ఫీచర్స్‌ను జోడించే దిశగా వాట్సాప్ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనివల్ల మన వీడియో కాలింగ్ అనుభవం మరింత ఆనందదాయకంగా మారనుంది.

కొత్త ఫీచర్స్ ఎలా పనిచేస్తాయంటే?
వీడియో కాలింగ్‌లో ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఫీచర్స్‌ను వాట్సాప్ తీసుకురానుంది. వీటిని వాడుకొని మన వీడియో లుకింగ్‌లో ఎన్నో కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్‌తో వీడియో కాల్‌కు అదనపు హంగులను జోడించుకోవచ్చు. 'డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్స్' ఫీచర్ ద్వారా మన చర్మం మృదువుగా కనిపించేలా మార్చేయొచ్చు. ఇందుకోసం ఒక టచ్-అప్ టూల్ వీడియో కాల్ ఇంటర్ ఫేస్‌ కుడి వైపు ఎగువ భాగంలో అందుబాటులోకి వస్తుంది. ఇక తక్కువ వెలుతురులో వీడియో కాల్ చేసే వారి కోసం 'లో లైట్ మోడ్' ఫీచర్ ఉంది. దీన్ని ఆన్ చేసుకుంటే తక్కువ వెలుతురులోనూ బెటర్ క్వాలిటీత కాల్ చేసే సౌలభ్యం కలుగుతుంది.

ఇందుకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా కొన్ని మార్పులు జరుగుతాయి. వీటితోపాటు బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ అనే మరో టూల్ కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడుకొని మన బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయొచ్చు. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ తీసేసి దాని స్థానంలో ఒక డీఫాల్డ్ పిక్చర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఈవిధంగా డీఫాల్డ్ పిక్చర్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ చేసుకునే ఆప్షన్ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు సెట్ కాకపోవచ్చని అంటున్నారు. అందువల్ల దీన్ని డెస్క్‌టాప్ యూజర్లకే ఈ ఫీచర్‌ను పరిమితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జూన్ నుంచే టెస్టింగ్
ఈ కొత్త ఫీచర్లతో జూన్ నెల నుంచే ఆండ్రాయిడ్ బీటా '2.24.16.7' వర్షన్‌లో టెస్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది. తొలుత కొద్దిమంది యూజర్స్‌కు ఈ వీడియో కాలింగ్ ఎఫెక్ట్‌లను అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. వాట్సాప్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ అయితే కొత్త ఫీచర్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ కొత్త ఫీచర్ల టెస్టింగ్‌కు సంబంధించిన ఒక ఇంటర్‌ఫేస్‌ను తాజాగా ఓ వెబ్‌సైట్ విడుదల చేసింది. వాటి ప్రకారం వీడియో కాలింగ్ చేస్తున్న క్రమంలో దిగువ భాగంలో ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్, ఎఫెక్ట్స్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. కుడి వైపు ఎగువ భాగంలో ఫేస్ ఎడిటింగ్ ఆప్షన్, లో లైట్ మోడ్, మ్యాజిక్ వ్యాండ్ ఆప్షన్ ఒకదాని కింద మరొకటి ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.