Volvo Electric Cars Renamed: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా 2025 సంవత్సరానికి భారత మార్కెట్లో తన ఆల్-ఎలక్ట్రిక్ శ్రేణిని అప్‌డేట్ చేసింది. వీటిలో అతిపెద్ద అప్డేట్ ఏంటంటే కంపెనీ వాటి పేర్లను మార్చుకుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చిన 'XC40 రీఛార్జ్', 'C40 రీఛార్జ్'లను వరుసగా 'వోల్వో EX40', 'EC40'గా మార్చింది.
ఈ కొత్త పేర్లను గ్లోబల్ మార్కెట్లో ఒక ఏడాది కిందటే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'వోల్వో EX40', 'EC40' రెండూ ఒక్కొక్క వేరియంట్‌లో వస్తున్నాయి. వీటి ధర వరుసగా రూ. 50.10 లక్షలు, రూ. 59 లక్షలు (ఎక్స్-షోరూమ్).

రెండు మోడళ్లలోనూ అందించే ఫీచర్ల జాబితా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందులో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12.3-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పిక్సెల్ LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. వీటితోపాటు 360-డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిషన్ మిటిగేషన్ సపోర్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్‌లు కూడా వీటిలో ఉంటాయి.

వోల్వో EX40, EC40 పవర్‌ట్రెయిన్: పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే.. 'వోల్వో EX40' రియర్ ఆక్సిల్‌పై ఒకే మోటార్ సెటప్‌తో వస్తుంది. ఇది 241 bhp పవర్, 420 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ మోడల్ 69 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 475 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

ఇక 'వోల్వో EC40' విషయానికి వస్తే ఇది మార్కెట్లో డ్యూయల్-మోటార్ సెటప్‌తో మాత్రమే అమ్ముడవుతోంది. ఇది జాయింట్‌గా 414 bhp పవర్, 660 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పెద్ద 78 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 530 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

వోల్వో S90 సేల్స్ నిలిపివేత: మరోవైపు వోల్వో ఇండియా తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ 'వోల్వో S90' అమ్మకాలను కూడా నిలిపివేసింది. 2021 నుంచి అమ్ముడవుతున్న ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ E-క్లాస్, BMW 5-సిరీస్‌లతో పోటీ పడుతోంది. వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఇప్పుడు కంపెనీ లైనప్‌లో నాలుగు హై-రైడింగ్ ఆఫర్‌లు ఉన్నాయి

- XC60
- XC90
- EC40
- EX40
కంపెనీ 'వోల్వో S90'ను తొలిసారిగా 2016లో మిడ్-సైజ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా విడుదలైన వెంటనే దీనిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. బెంగళూరు సమీపంలోని హోస్కోట్ సౌకర్యంలో భారతదేశంలో అసెంబుల్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 'S90' బలమైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అమ్ముడవుతోంది. దీని అమ్మకాలను జర్మనీ, UK, ఫ్రాన్స్, ఇటలీ వంటి అనేక ఇతర మార్కెట్లలో కూడా నిలిపివేశారు.

త్వరలో 'వోల్వో S90' ఫేస్‌లిఫ్ట్ విడుదల: కంపెనీ పెద్ద మోడల్ 'వోల్వో XC90' మాదిరిగానే 'వోల్వో S90' కూడా కొన్ని నెలల క్రితం కాంప్రహెన్సివ్ ఫేస్‌లిఫ్ట్‌ను పొందింది. ఇది దాని మొదటి తరం ఎగ్జిక్యూటివ్ సెడాన్‌కు రెండవ అప్డేట్. ఇది మొదట చైనాలో అమ్మకానికి వస్తుంది. ఈ అప్డేట్‌తో పాటు కారులో పెద్ద స్క్రీన్, కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లతో పాటు ADAS, కొద్దిగా మార్పులు చేసిన క్యాబిన్ ఉంటుంది. 'వోల్వో S90' ఫేస్‌లిఫ్ట్ సవరించిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కూడా పొందుతుంది. ఈ అప్డేటెడ్ 'వోల్వో S90' ఫేస్‌లిఫ్ట్ గ్లోబల్ సేల్స్ వచ్చే ఏడాదికి ప్రారంభమయ్యే నాటికి భారత మార్కెట్లో విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అసెంబుల్ చేయబడుతుందని గమనించాలి.

భారత్‌లోకి 'ఒప్పో రెనో 14 5G' సిరీస్ వచ్చేస్తుందోచ్- లాంఛ్ ఎప్పుడో తెలుసా?
గేరు మార్చే పనిలేదు- భారత్‌లో అదిరే ఆటోమేటిక్ కార్లు!- రూ.8 లక్షల లోపే!!
ఐఫోన్ల కోసం కొత్త కెమెరా యాప్- దీనితో అద్భుతమైన ఫొటోగ్రఫీ మీ సొంతం!- యూజర్లకు ఇక పండగే!!