ETV Bharat / technology

జోరుగా విస్తరిస్తున్న వీఐ 5G సేవలు!- ఇప్పుడు మరో నగరంలో అన్​లిమిటెడ్ డేటాతో హైస్పీడ్ ఇంటర్నెట్! - VODAFONE IDEA 5G

బెంగళూరులో వీఐ 5G సేవలు షురూ- వివరాలు ఇవే!

Vodafone Idea 5G
Vodafone Idea 5G (Photo Credit- Vi)
author img

By ETV Bharat Tech Team

Published : June 10, 2025 at 8:47 PM IST

2 Min Read

Vodafone Idea 5G: వోడాఫోన్ ఐడియా (Vi) మంగళవారం బెంగళూరులో తన 5G సేవల లాంఛ్​ను ప్రకటించింది. కంపెనీ రేపటి నుంచి అంటే జూన్ 11వ తేదీ నుంచి ఈ 5G రోల్​అవుట్​ చేయనుంది. వీఐ ఇటీవలే దిల్లీలో తన 5G సేవలను ప్రారంభించింది. ఇప్పుడు బెంగళూరులో ప్రారంభించేందుకు రెడీ అయింది. దిల్లీ కంటే ముందు కంపెనీ ముంబయి, చండీగఢ్, పాట్నాలో కూడా 5G సర్వీస్​ను ప్రారంభించింది. ఇకపోతే కంపెనీ బెంగళూరులో నెట్‌వర్క్ పనితీరును ఆప్టిమైజ్ చేసేందుకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు శాంసంగ్‌తో చేతులు కలిపింది.

వీఐ జూన్ 11 నుంచి బెంగళూరులో తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు ఒక పత్రికా ప్రకటన ద్వారా ధృవీకరించింది. 5G-ఎనేబుల్డ్ ఫోన్‌లను కలిగి ఉన్న బెంగళూరులోని వీఐ యూజర్లు రేపట్నుంచి నగరంలో వీఐ 5G సేవలను పొందొచ్చు. లాంఛ్ ఆఫర్‌గా రూ. 299 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లపై కంపెనీ అన్​లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది.

కంపెనీ గత నెలలో ముంబయి, దిల్లీ-NCR, పాట్నా, చండీగఢ్‌లలో తన 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన 17 మేజర్ సర్కిల్స్​ను కవర్ చేయడమే కంపెనీ లక్ష్యం. తాజా విస్తరణ ఈ ప్రణాళికలో ఒక భాగం.

బెంగళూరులో తన వినియోగదారులకు 5G ఎక్స్​పీరియన్స్​ను అందించడానికి అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు శాంసంగ్​తో జతకట్టినట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది ఆటోమేటిక్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ కోసం AI-ఆధారిత సెల్ఫ్-ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లను (SON) ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ నెట్‌వర్క్‌ను స్వీయచాలకంగా పర్యవేక్షిస్తుంది.

తద్వారా కనెక్టివిటీని ఆటోమేటిక్​గా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో వినియోగదారులు మెరుగైన, స్థిరమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్​ను పొందగలరు. వీఐ 5G నాన్-స్టాండలోన్ ఆర్కిటెక్చర్ కారణంగా వినియోగదారులు 4G, 5G మధ్య నెట్‌వర్క్‌లను సులభంగా మార్చుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్రేట్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది.

ఇకపోతే మెరుగైన కవరేజ్, ఫాస్టెస్ట్ డేటా స్పీడ్, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి కర్ణాటకలో తన 4G నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇండోర్ కవరేజీని పెంచడానికి సుమారు 3,000 సైట్‌లలో 900MHz స్పెక్ట్రమ్‌ను మోహరించినట్లు, 1,800 సైట్‌లలో 2100MHz స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు, మరో 1,000 స్థానాలకు 2,100MHz స్పెక్ట్రమ్‌ను జోడించినట్లు పేర్కొంది. అదనంగా కంపెనీ 4,100 కంటే ఎక్కువ సైట్‌లలో దాని 1,800MHz సామర్థ్యాన్ని పెంచింది. తద్వారా కవరేజ్, డేటా ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచింది.

వీఐ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 299 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లతో 5G డేటాను పొందొచ్చు. ఇది 5G నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతాలలో సపోర్డెడ్ డివైజ్​లలో అన్​లిమిటెడ్ 5G డేటాను, రోజుకు 1GB 4G డేటాను అందిస్తుంది. రోజువారీ కోటా తర్వాత డేటా వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అన్​లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.

యాపిల్ వార్షిక ఈవెంట్​లో కిర్రాక్ ప్రకటనలు- యూజర్లకు పండగే!

పనిచేయకుండా ఆగిపోయిన చాట్​జీపీటీ- గగ్గోలు పెడుతున్న వినియోగదారులు!

కాంపాక్ట్ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- అయితే కాస్త ఆగండి- త్వరలో కొత్త మోడల్స్ ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.