Vivo V50e Launched in India: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఈరోజు తన స్టైలిష్ V సిరీస్‌లో 'వివో V50e' స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంఛ్ చేసింది. అధునాతన పోర్ట్రెయిట్ ఫీచర్లు, లగ్జరియస్ డిజైన్‌తో దీనిలో సోనీ మల్టీఫోకల్ ప్రో పోర్ట్రెయిట్ కెమెరా సిస్టమ్, 50-MP Eye-AF గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, కేవలం 0.739cm కొలతలు కలిగిన స్లిమ్ బాడీతో వస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
వివో V50e వేరియంట్స్:
- 8 GB + 128 GB
- 8 GB + 256 GB
వేరియంట్లవారీగా దీని ధరలు:
- 8 GB + 128 GB వేరియంట్ ధర: రూ.28,999
- 8 GB + 256 GB వేరియంట్ ధర: రూ.30,999
కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ ఫోన్‌ను రెండు ఆకర్షణీయమైన రంగులలో ప్రవేశపెట్టింది.
- సఫైర్ బ్లూ
- పెర్ల్ వైట్
సేల్ డీటెయిల్స్: ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17 నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో సేల్కు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈరోజు నుంచి వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో దీన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
Check out the new vivo V50e. Luxury never looked better and now you can own it with exclusive offers.
— vivo India (@Vivo_India) April 10, 2025
Prebook Now https://t.co/iiBfuyz1EB#vivoV50e #PortraitSoPro pic.twitter.com/cPFlx37DLA
ఆన్‌లైన్ ఆఫర్స్: HDFC బ్యాంక్, SBI కార్డ్ పేమెంట్స్‌తో కస్టమర్లకు ఈ ఫోన్‌పై 10% వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఛేంజ్ చేసుకుంటే 10% వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలుపై 'వివో TWS' ఇయర్‌బడ్స్‌ను కంపెనీ కేవలం రూ.1,499కే ఆఫర్ చేస్తోంది.
ఆఫ్‌లైన్ ఆఫర్స్: SBI, HSBC, Amex, DBS, IDFC, Kotak, ఇతర బ్యాంకులతో దీనిపై 10% వరకు ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 9 నెలల జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. వివో వి-షీల్డ్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌పై 40% వరకు డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా 'సర్వీఫై', 'క్యాషిఫై' ద్వారా 10% వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
The vivo V50e brings elegance and immersion together in a form so sleek, all you feel is the moment.
— vivo India (@Vivo_India) April 9, 2025
Know more https://t.co/TfvlN6iy20#vivoV50e #PortraitSoPro pic.twitter.com/MFbw4BCyMy
కాంతితో మారే ఫోన్: ఈ కొత్త 'వివో V50e' స్మార్ట్‌ఫోన్ సఫైర్ బ్లూ వేరియంట్లో ప్రతి ఫోన్ ఒక ప్రత్యేకమైన ప్యాటెర్న్‌ను కలిగి ఉంటుంది. ఇది రత్నం లాంటి షైనింగ్, మినరల్ టెక్చర్‌ను అందిస్తుంది. ఇక దీని పెర్ల్ వైట్ వేరియంట్ అయితే వాటర్ లాంటి ఎఫెక్ట్, కాంతితో మారే ముత్యాల మెరుపును కలిగి ఉంటుంది. 0.739cm స్లిమ్ ప్రొఫైల్, 17.19cm (6.77 అంగుళాల) అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేతో ఈ ఫోన్ ఆకర్షణీయమైన లుక్‌లో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ ఎక్స్పీరియన్స్: ఈ ఫోన్ పవర్ఫుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సోనీ IMX882 సెన్సార్‌తో కూడిన OIS తక్కువ కాంతిలో కూడా హై-క్వాలిటీతో స్థిరమైన చిత్రాలను తీయడంలో సహాయపడుతుంది. ఈ సోనీ మల్టీఫోకల్ ప్రో పోర్ట్రెయిట్ 1x (26mm), 1.5x (39mm), 2x (52mm) అనే మూడు ఫోకల్ లెంగ్త్ ఆప్షన్లను అందిస్తుంది. దీని 50-MP Eye-AF గ్రూప్ సెల్ఫీ కెమెరా 92-డిగ్రీల వెడల్పు గల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. అంతేకాకుండా దీనిలో భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ ఉంది. ఇది ప్రత్యేకమైన ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. దీన్ని పెళ్లి ఫొటోల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ప్రొటెక్షన్: ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. ఈ ఫోన్‌ను 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఉంచినా ఏం కాదని కంపెనీ చెబుతోంది. దీని డైమండ్ షీల్డ్ గ్లాస్, కాంప్రహెన్సివ్ కుషనింగ్ స్ట్రక్చర్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను 50% పెంచుతాయని వివరించింది.
బ్యాటరీ: ఈ ఫోన్లో 5600mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB RAM + 8GB ఎక్స్‌టెండెడ్ RAMతో వస్తుంది. ఇవి మల్టీ టాస్కింగ్‌ను సులభతరం చేస్తాయి.
సాఫ్ట్‌వేర్: ఇది Android 15 ఆధారంగా FunTouch OS 15పై రన్ అవుతుంది.
స్మార్ట్ AI ఫీచర్లు: ఈ ఫోన్ అద్భుతమైన AI ఫీచర్లను కలిగి ఉంది. దీనిలోని AI ఇమేజ్ ఎక్స్‌పాండర్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI ఎరేజర్ 2.0 యూజర్‌కు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. దీనిలో మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ 'వివో V50e' అనేది గ్రేటర్ నోయిడాలో 'మేక్ ఇన్ ఇండియా' కింద తయారు చేసిన స్మార్ట్‌ఫోన్.
మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఎస్‌యూవీలు- రూ.7లక్షల లోపు టాప్ మోడల్స్ ఇవే!
KTM నుంచి మొదటి ఎండ్యూరెన్స్ మోటార్‌సైకిల్- లాంఛ్‌కు ముందే కీలక స్పెక్స్ రివీల్!
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం- లావాదేవీల పరిమితి పెంపు!