ETV Bharat / technology

ఫ్లాగ్​షిప్ స్థాయి ఫీచర్లతో 'వివో T4 అల్ట్రా'- మిడ్-రేంజ్​ ధరలోనే లాంఛ్ - VIVO T4 ULTRA LAUNCHED IN INDIA

మిడ్​-రేంజ్ సెగ్మెంట్​లో వివో నయా స్మార్ట్​ఫోన్- ధర, ఫీచర్ల వివరాలు మీకోసం- ఓ లుక్కేయండి మరి!

Vivo T4 Ultra Launched in India
Vivo T4 Ultra Launched in India (Photo Credit- Vivo)
author img

By ETV Bharat Tech Team

Published : June 11, 2025 at 1:46 PM IST

2 Min Read

Vivo T4 Ultra Launched: వివో అభిమానులకు గుడ్​న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వివో T4 అల్ట్రా'ను కంపెనీ భారత మార్కెట్​లో విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్​సెట్, 50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ ఛార్జింగ్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్​ ఆధునిక యుగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

ఈ ఫ్లాగ్​షిప్ రేంజ్ ఫీచర్లతో కంపెనీ దీన్ని మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌లో 100x డిజిటల్ జూమ్ సపోర్ట్‌ను అందించింది. సాధారణంగా ఇది మిడ్​-రేంజ్​ స్మార్ట్​ఫోన్​లలో ఉండదు. దీంతోపాటు ఇందులో 1.5K రిజల్యూషన్‌తో క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ లభిస్తుంది. ఇది వినియోగదారులకు మంచి డిజైన్‌తో పాటు వీడియోలను చూసేటప్పుడు గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.

Vivo T4 Ultra
Vivo T4 Ultra (Photo Credit- Vivo)

వివో T4 అల్ట్రా' ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్ 6.67-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటుతో ఉంటుంది. ఈ డిస్​ప్లే 5,000 nits వరకు పీక్ బ్రైట్‌నెస్, 2,160Hz PWM డిమ్మింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.

సాఫ్ట్​వేర్: ఈ ఫోన్ Android 15-ఆధారిత FuntouchOS 15 పై నడుస్తుంది.

ప్రాసెసర్: ప్రాసెసర్​ కోసం కంపెనీ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్​ను అమర్చింది. ఇందులో 12GB LPDDR5 RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్​ సౌకర్యం అందుబాటులో ఉంది.

కెమెరా సెటప్: ఈ ఫోన్​లో​ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అందులో OIS సపోర్ట్​తో 50MP Sony IMX921 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఈ లెన్స్ 3x ఆప్టికల్, 10x టెలిఫొటో మాక్రో, 100x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్​ చేస్తాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్లు: కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, బ్లూటూత్ 5.4, Wi-Fi, OTG, GPS (NavIC), USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్​ను కలిగి ఉంది. దీంతోపాటు ఇది ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

కలర్ ఆప్షన్స్: ఇది మార్కెట్​లో రెండు కలర్ ఆప్షన్​లలో అందుబాటులో ఉంది.

  • మెటియోర్ గ్రే
  • ఫీనిక్స్ గోల్డ్

వేరియంట్లు: కంపెనీ ఈ ఫోన్​ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • 8GB+256GB
  • 12GB+256GB
  • 12GB+512GB

వేరియంట్ల వారీగా దీని ధరలు:

  • 8GB+256GB వేరియంట్ ధర: రూ. 37,999
  • 12GB+256GB వేరియంట్ ధర: రూ. 39,999
  • 12GB+512GB వేరియంట్ ధర: రూ. 41,999

సేల్ వివరాలు: ఈ ఫోన్ జూన్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

జోరుగా విస్తరిస్తున్న వీఐ 5G సేవలు!- ఇప్పుడు మరో నగరంలో అన్​లిమిటెడ్ డేటాతో హైస్పీడ్ ఇంటర్నెట్!

యాపిల్ వార్షిక ఈవెంట్​లో కిర్రాక్ ప్రకటనలు- యూజర్లకు పండగే!

పనిచేయకుండా ఆగిపోయిన చాట్​జీపీటీ!- గగ్గోలు పెడుతున్న వినియోగదారులు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.