Vivo T4 5G Launched in India: దేశీయ మార్కెట్లోకి వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ మంగళవారం (ఏప్రిల్ 22, 2025) మిడ్ సెగ్మెంట్ 'వివో T4 5G' పేరుతో దీన్ని లాంఛ్ చేసింది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ AI ఎరేస్, AI ఫోటో ఎన్‌హాన్స్, లైవ్ టెక్స్ట్, AI నోట్ అసిస్టెంట్, సూపర్ డాక్యుమెంట్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి జెన్ AI ఫీచర్‌లతో వస్తుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
Vivo T4 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 5,000 nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని స్క్రీన్ కవర్ గ్లాస్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది.
బ్యాటరీ: ఈ ఫోన్ 7,300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90 W ఛార్జర్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 90W వైర్డు ఫ్లాష్‌ఛార్జ్, రివర్స్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: ఈ వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 12 GB RAM, 256 GB స్టోరేజీతో Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
Power up with @vivo_india T4 #5G, driven by the ultra-efficient #Snapdragon 7s Gen 3! ⚡
— Snapdragon India (@Snapdragon_IN) April 22, 2025
Experience peak performance, extended battery life, and seamless multitasking. Are you ready to dominate your day? pic.twitter.com/vLGBr0QSJf
ఆపరేటింగ్ సిస్టమ్: ఇది Android 15 ఆధారంగా Funtouch OS 15పై పనిచేస్తుంది. అంతేకాక కంపెనీ ఈ ఫోన్‌తో 2 సంవత్సరాల Android సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది.
కెమెరా సెటప్: దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్ (OIS, f/1.8 ఎపర్చరు), 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ (f/2.4 ఎపర్చరు) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా (f/2.0 ఎపర్చరు)ను కలిగి ఉంది.
Welcome to the Turbo life. Level up on multitasking, last beyond the day, slay with your display, and get clear reels in 4K, with the one and only vivo T4.
— vivo India (@Vivo_India) April 22, 2025
Sale starts on 29th april.
Know more https://t.co/pZQXjK1JQc#vivoT4 #TurboLife #GetSetTurbo pic.twitter.com/wTl8Z3yDHU
కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్ మార్కెట్లో రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
- ఫాంటమ్ గ్రే
- ఎమరాల్డ్ బ్లేజ్
ఇతర ఫీచర్లు: ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP65 రేటింగ్, 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, OTG, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. దీని ఎమరాల్డ్ బ్లేజ్ వేరియంట్ కొలతలు 163.40 x 76.40 x 7.89mm, ఫాంటమ్ గ్రే వేరియంట్ కొలతలు 7.93mm. ఈ రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ 199 గ్రాముల బరువు ఉంటుంది.
వేరియంట్స్:
- 8 GB/128 GB
- 8 GB/256 GB
- 12 GB/256 GB
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 8 GB/128 GB వేరియంట్ ధర: రూ. 21,999
- 8 GB/256 GB వేరియంట్ ధర: రూ. 23,999
- 12 GB/256 GB వేరియంట్ ధర: రూ. 25,999
సేల్ వివరాలు: ఈ ఫోన్ ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివోతో పాటు అన్ని భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!
10Gbps స్పీడ్ ఇంటర్నెట్ను ప్రారంభించిన చైనా- ఇకపై సెకన్లలో సినిమాలు డౌన్లోడ్!
సువాసనలు వెదజల్లే స్మార్ట్‌ఫోన్ ఎప్పుడైనా చూశారా?- అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే!