UPI Services Down: దేశంలో నిలిచిపోయిన UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తగా NPCI స్పందించి కొన్ని గంటల్లో సమస్యను పరిష్కరించింది.
అసలేం జరిగిందంటే?: భారతదేశంలో శనివారం UPI సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులు UPI లావాదేవీల్లో పెద్ద అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్యతో SBI, Google Pay, Paytm వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, పేమెంట్స్, యాప్ యాక్టివిటీలో సమస్యలు శనివారం మధ్యాహ్నం నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయలేకపోయినట్లు యూజర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో దీనిపై ETV భారత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రజలతో మాట్లాడి సమస్య విస్తృతంగా ఉందని నిర్ధారించింది. QR కోడ్ స్కానింగ్ ద్వారా లేదా UPI-లింక్డ్ ఫోన్ నంబర్లు లేదా UPI IDలకు నేరుగా పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రర్ అని వచ్చింది. UPI యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లలో ఎర్రర్ విస్తరించి ఉండటం వల్ల ఈ సమస్య UPI సర్వర్‌లకు లింక్ అయినట్లుగా కన్పిస్తోంది. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు కొన్ని బ్యాంకుల్లో వారి అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోగలిగారు. అయితే శనివారం రోజు పేమెంట్స్ మాత్రం అందరికీ అందుబాటులో లేవు.
మరోవైపు గత 24 గంటల నుంచి యూపీఐ సేవలు డౌన్ అయినట్లు సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్‌డిటెక్టర్ నివేదించింది. శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పేమెంట్స్ ప్రాసెస్ చేస్తున్న 58శాతం మంది, ఫండ్స్ ట్రాన్స్ఫర్లో 42శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు నివేదించింది.
సోషల్ మీడియాలో ఫిర్యాదులు: వినియోగదారులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీనిపై UPI కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా కొంతమంది వినియోగదారుల UPI ట్రాన్సాక్షన్స్ తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించింది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించింది. ఎట్టకేలకూ కొన్ని గంటల తర్వాత UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
Tried paying via UPI and it’s stuck? You’re not alone 🫠💸
— Abhay Singh Bhadauria (@AbhayTweetscape) April 12, 2025
UPI servers are acting up again ⚠️📵
Chill, wait it out, and don’t spam that pay button! ⏳❌#UPIDown #UPI #DigitalPayments #GooglePay #PhonePe #Paytm #Fintech #India
#upi Guys don't try UPI payment. I have been stuck in a tea shop. #upidown
— abdul munavir (@abdulmunavir) April 12, 2025
Ugh, not again! 🤦♀️ UPI is down, and I'm stuck here like 🧍♀️. Trying to pay for my 🍕, but the app is just spinning. This is so frustrating! 😤 Guess I'll be paying with cash, old-school style. #phonepe #googlepay #mobiquick#UPIDown
— Pushpendra Singh Raj (@Pushpensr) April 12, 2025
UPI అనేది రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్. దీని సహాయంతో వినియోగదారులు ఎక్కడ ఉన్నా సరే స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదును వేగంగా బదిలీ చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. దీంతో ఈ సేవలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇది దేశంలో నగదు డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో UPI సర్వీసులతో డిజిటల్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు.
మనిషిలా ఆలోచించే 'మివి AI'- మీ క్లోజ్ ఫ్రెండ్‌లా ముచ్చట పెట్టుకోవచ్చు!
యువతకు పిచ్చెక్కించే హయబుసా ఇప్పుడు సరికొత్తగా!- దీనిలో ఏం ఫీచర్లు ఉన్నాయంటే?
7300mAh బ్యాటరీ, కిర్రాక్ ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్ సిరీస్- బడ్జెట్ ధరలోనే లాంఛ్!