Upcoming Compact SUVs in India: కాంపాక్ట్ SUV భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అనేక కార్ల తయారీ సంస్థలు కొత్త, అప్డేటెడ్ కాంపాక్ట్ SUVలను విడుదల చేసేందుకు రెడీ అయ్యాయి. ఇవి స్టైలిష్ డిజైన్, మెరుగైన ఇంజిన్ పనితీరు, అత్యాధునిక ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. మీరు కొత్త కాంపాక్ట్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే 2025 లాస్ట్ హాఫ్ వరకు వేచి ఉంటే మంచిది.
Maruti Suzuki eVX Compact SUV:

ఇది మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV. ఇప్పుడు ఈ వాహనం కాంపాక్ట్, సరసమైన ధరలో వస్తోంది. ఈ ఫుల్లీ ఎలక్ట్రికల్ కారు 400-500 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుంది.
Hyundai Creta EV:

హ్యుందాయ్ 2025 చివరి నాటికి తన పాపులర్ క్రెటా SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేస్తుంది. ఈ క్రెటా EV దాని పెట్రోల్-డీజిల్ వెర్షన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ కారు టాటా నెక్సాన్ EVకి గట్టి పోటీని ఇస్తుంది.
ఎలక్ట్రిక్
Mahindra XUV300 Facelift:

మహింద్రా తన XUV300ను కొత్త డిజైన్, ఇంక్రీజ్డ్ క్యాబిల్ స్పేస్‌తో విడుదల చేయనుంది. కంపెనీ దీనికి కొత్త పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలోని పెద్ద టచ్‌స్క్రీన్, మెరుగైన భద్రతా ఫీచర్లు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
Tata Nexon CNG:

టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు టాటా త్వరలో నెక్సాన్ CNGని విడుదల చేయనుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆకర్షణీయమైన SUV లుక్ కోరుకునే కొనుగోలుదారులకు ఈ కారు గొప్ప ఎంపిక అవుతుంది.
Kia Clavis (Compact SUV-Coupe):

కియా తన కొత్త SUV-కూపే కారు క్లావిస్‌ను విడుదల చేయనుంది. ఇది సెల్టోస్ కింది విభాగంలోకి ప్రవేశిస్తుంది. స్పోర్టీ డిజైన్‌తో వచ్చే ఈ కారు పెట్రోల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కియా హై క్వాలిటీ డిజైన్, టెక్నాలజీతో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
పవర్ఫుల్ ఫీచర్లతో మోటరోలా నుంచి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్!- ధర ఎంతంటే?
ఐఫోన్ల కోసం కొత్త 'iOS 26'- 'iOS 19'ను ఎందుకు రిలీజ్ చేయలేదు?