2025 TVS Sport Bike: దేశీయ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన కమ్యూటర్ బైక్ 'TVS స్పోర్ట్' కొత్త టీజర్‌ను విడుదల చేసింది. అంటే కంపెనీ ఈ బైక్‌ను త్వరలో కొత్త కలర్ ఆప్షన్లతో భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తుంది. కొత్త రంగు ఎంపికలతో వచ్చే ఈ బైక్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది. OBD2B నిబంధనలను కూడా పాటిస్తుంది. ఈ అప్డేట్స్ నేపథ్యంలో కంపెనీ దీని ధరను కూడా పెంచే అవకాశం ఉంది.
TVS స్పోర్ట్ ధర: ప్రస్తుత TVS స్పోర్ట్ మోడల్ ధర రూ. 59,881 (ఎక్స్-షోరూమ్), రూ. 71,785 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త వెర్షన్ ప్రస్తుత వెర్షన్ కంటే కొంచెం ఖరీదైనదిగా ఉంటుందని నిపుణుల అంచనా.
వేరియంట్స్: ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో వస్తుంది.
- ES
- ELS
కలర్ ఆప్షన్స్: ఈ కొత్త మోడల్ 4 మోనోటోన్ కలర్ ఆప్షన్లలో రావచ్చు.
- స్ట్రెయిట్ బ్లూ
- ఆల్ బ్లాక్
- ఆల్ గ్రే
- ఆల్ రెడ్
ఇకపోతే మునుపటి మోడల్ మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో వచ్చింది. అవి బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, వైట్ పర్పుల్ అండ్ ఒక మోనోటోన్ ఆప్షన్: మెటాలిక్ బ్లూ.
ఇకపోతే ఈ కొత్త మోడల్ డిజైన్ పరంగా ELS ట్రిమ్ బోల్డర్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ES వేరియంట్ ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ బైక్ 2025 ఎడిషన్ బ్రైట్ కలర్స్‌ను కలిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

TVS స్పోర్ట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 'TVS స్పోర్ట్' బైక్ 109.7cc సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7350rpm వద్ద గరిష్టంగా 8.08 bhp పవర్, 4500rpm వద్ద 8.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అయితే ఈ కమ్యూటర్ బైక్‌లో డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.

ఈ మోటార్ సైకిల్ ముందు భాగంలో స్పోర్ట్స్ టెలిస్కోపిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేజ్, ఎకనామిక్ మీటర్, వార్నింగ్ లైట్లతో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. ఈ మోటార్ సైకిల్లో 17 అంగుళాల ట్యూబ్ లెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటితోపాటు ఈ 'TVS స్పోర్ట్' ఎలక్ట్రిక్ స్టార్టర్‌తో కూడా వస్తుందని గమనించాలి.
మార్స్‌పై జీవం ఉందా?- పుర్రె ఆకారంలో మిస్టీరియస్ నిర్మాణాన్ని గుర్తించిన నాసా రోవర్
ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం- నిప్పులు కక్కుతూ నేలకు జారనున్న ఉల్కలు!
ఇస్రో ఖాతాలో మరో ఘనత- రోదసిలో స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్