Affordable Electric Bikes in India: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ-వీలర్స్ సేల్స్ మంచి జోరందకున్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ చాలా మంది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కొనేందుకే ఇష్టపడుతున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో అత్యంత సరసమైన ధరకు లభించే టాప్-5 మోడల్స్ గురించి తెలుసుకుందాం రండి.
5. Revolt RV BlazeX (ధర- రూ.1,11,456):
రివోల్ట్ మోటార్ ఈ మోటార్‌సైకిల్‌ను కేవలం ఒకే వేరియంట్‌లో విక్రయిస్తోంది. కంపెనీ దీనిలో 3.24 kWh పోర్టబుల్ బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది. ఈ బ్యాటరీతో ఈ ఇ-బైక్ 150 కి.మీ వరకు ప్రయాణించగలదు. కంపెనీ దీనిలో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించింది. స్పోర్ట్ మోడ్‌లో దీని గరిష్ఠ వేగం గంటకు 85 కి.మీ. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 5.4bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
4. Ola Roadster (ధర- రూ. 1,05,379):
ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది తన ఎలక్ట్రిక్ బైక్ శ్రేణిని ప్రారంభించింది. ఈ శ్రేణిలో చేర్చిన ఓలా రోడ్‌స్టర్ మొత్తం మూడు బ్యాటరీ సామర్థ్యం గల వేరియంట్లలో అమ్ముడవుతోంది.
ఓలా రోడ్‌స్టర్ బ్యాటరీ ఆప్షన్స్:
- 3.5 kwh
- 4.5 kwh
- 6 kwh
బ్యాటరీ ఆప్షన్స్ వారీగా రేంజ్:
- 3.5 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 151 కి.మీ
- 4.5 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 190 కి.మీ
- 6 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 248 కి.మీ
ధరలు:
- 3.5 kwh బ్యాటరీతో దీని ధర: రూ. 1,05,379
- 4.5 kwh బ్యాటరీతో దీని ధర: రూ. 1,20,646
- 6 kwh బ్యాటరీతో దీని ధర: రూ. 1,41,002
3. Ola Roadster X (ధర- రూ. 1,00,706):
ఇది ఓలా ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన రెండవ సరసమైన ఎలక్ట్రిక్ బైక్. ఇది మూడు బ్యాటరీ వేరియంట్లలో అమ్ముడవుతోంది. అంతేకాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌ను అందించింది.
బ్యాటరీ ఆప్షన్స్:
- 2.5 kwh
- 3.5 kwh
- 4.5 kwh
బ్యాటరీ ఆప్షన్స్ వారీగా రేంజ్:
- 2.5 kwh బ్యాటరీతో దీని రేంజ్: 140 కి.మీ
- 3.5 kwh బ్యాటరీతో దీని రేంజ్: 196 కి.మీ
- 4.5 kwh బ్యాటరీతో దీని రేంజ్: 252 కి.మీ
ధరలు:
- 2.5 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర: రూ. 1,00,706 (ఎక్స్-షోరూమ్)
- 3.5 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర: రూ. 1,10,997 (ఎక్స్-షోరూమ్)
- 4.5 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర: రూ. 1,21,287 (ఎక్స్-షోరూమ్)
2. Oben Rorr EZ (ధర- రూ. 1,00,112):

ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ కూడా మార్కెట్లో తన సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను విక్రయిస్తోంది. ఈ మోటార్ సైకిల్‌లో ఎకో, స్పోర్ట్, హైపర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లూ ఉన్నాయి.
వేరియంట్స్: కంపెనీ దీన్ని మూడు బ్యాటరీ ప్యాక్స్‌తో అందిస్తుంది.
- 2.6 kWh
- 3.4 kWh
- 4.4 kWh
బ్యాటరీ ఆప్షన్స్ వారీగా రేంజ్:
- 2.6 kwh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 110 కి.మీ
- 3.4 kWh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 140 కి.మీ
- 4.4 kWh బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్: 175 కి.మీ
ధరలు:
2.6 kwh బ్యాటరీతో దీని ధర: రూ. 1,00,112 (ఎక్స్-షోరూమ్)
3.4 kWh బ్యాటరీతో దీని ధర: రూ. 1,20,468 (ఎక్స్-షోరూమ్)
4.4 kWh బ్యాటరీతో దీని ధర: రూ. 1,30,646 (ఎక్స్-షోరూమ్)
1. Revolt RV1 (ధర- Rs 91,317):
రివోల్ట్ మోటార్ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బ్యాటరీ ఆధారంగా రెండు వేరియంట్లలో, కలర్ ఆప్షన్స్ పరంగా నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. దీని ధరలు రూ. 91,317, రూ. 94,368, రూ. 1,06,571, రూ. 1,09,622 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
బ్యాటరీ ఆప్షన్స్: కంపెనీ దీన్ని రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో అందిస్తుంది.
- 2.2 kWh
- 3.24 kWh
బ్యాటరీ ఆప్షన్స్ వారీగా రేంజ్:
- 2.2 kWh బ్యాటరీతో దీని రేంజ్: 100 కి.మీ
- 3.24 kWh బ్యాటరీతో దీని రేంజ్: 160 కి.మీ
బడ్జెట్ ధరలో మంచి ల్యాప్‌టాప్ కావాలా?- అయితే ఈ ఏసర్ కొత్త మోడల్‌పై ఓ లుక్కేయండి!
అతిపెద్ద బ్యాటరీతో 'ఐకూ Z10 5G'!- లాంఛ్ ఎప్పుడో తెలుసా?
స్నన్నింగ్ లుక్‌లో డుకాటి నుంచి మరో ప్రీమియం బైక్- ధర ఎంతో తెలుసా?