Cars With 6 Airbags Under 10 Lakhs: ప్రస్తుతం ప్రతి ఇంట్లో కారు ఉండడం సాధారణ విషయం అయిపోయింది. మంచి కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. తక్కువ ధరలోనే లేటెస్ట్ ఫీచర్లు, మంచి స్పెసిఫికేషన్లతో పాటు విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్ ఉండాలని అంతా కోరుకుంటారు. అన్నింటికంటే ముందు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణికుల భద్రతా పరంగా కారులో ఎయిర్‌బ్యాగ్స్ చాలా ముఖ్యమైనవి.
వాహనాలలో భద్రతా ఫీచర్ల కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, కొనుగోలుదారులలో సేఫ్టీ ఫీచర్లపై అవగాహన కారణంగా అనేక కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు ఎంట్రీ-లెవల్ మోడల్స్ నుంచి తమ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయి. వీటితో పాటు కంపెనీలు తమ మోడల్ లైన్లలో మరింత స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న టాప్-5 కార్ల గురించి తెలుసుకుందాం రండి. అది కూడా రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో అందుబాటులో ఉన్న మోడల్స్ వివరాలు మీకోసం.
5. Hyundai Grand i10 Nios: కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన 'గ్రాండ్ i10 నియోస్' కారును రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విక్రయిస్తోంది. ఈ కారు భారతదేశంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అమ్ముడవుతోంది. చౌకైన కార్లలో ఇది కూడా ఒకటి. కంపెనీ గత అక్టోబర్‌లో దీని అన్ని వేరియంట్‌లను 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్డేట్ చేసింది.

ఈ 'గ్రాండ్ i10 నియోస్' కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 82bhp పవర్, 114Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ దీన్ని డ్యూయల్ సిలిండర్ ట్యాంక్ CNG ఫీచర్‌తో కూడా అందిస్తోంది. ఈ కారు మార్కెట్లో టాటా టియాగో, మారుతి స్విఫ్ట్ మోడల్స్‌తో పోటీపడుతుంది.
4. Maruti Suzuki WagonR: మారుతి సుజుకి కూడా తన మోడళ్లను 6 ఎయిర్‌బ్యాగ్‌లతో నవీకరిస్తోంది. వీటిలో ఇటీవలి అప్డేట్ మారుతి 'సుజుకి వ్యాగన్ఆర్'కు లభించింది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు అందించారు. ఈ నేపథ్యంలో దీని ధర కూడా రూ.14,000 పెరిగింది. దీంతో ఈ కారు ధర ఇప్పుడు రూ.5.79 లక్షల నుంచి రూ.7.62 లక్షల మధ్య ఉంది.

ఈ కారు రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్. వీటిలో మొదటి ఇంజిన్ 68bhp శక్తిని అందిస్తుంది. రెండవ ఇంజిన్ 89bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఇతర మారుతి మోడళ్ల మాదిరిగానే ఇది కూడా CNG వేరియంట్లోనూ లభిస్తుంది.
3. Maruti Suzuki Celerio:

దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారు మారుతి సెలెరియో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో మార్కెట్లో అమ్ముడవుతోంది. ఈ జాబితాలో ఇది థర్డ్ మోస్ట్ ఎకనామికల్ కారు కూడా. ఈ అప్డేట్‌తో దీని ధర రూ. 32,500 గణనీయంగా పెరిగింది. ఇప్పుడు దీని ధర రూ. 5.64 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారులో 1.0-లీటర్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్‌పై 66bhp పవర్, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో CNGలో అయితే ఈ ఇంజిన్ 56bhp పవర్, 82.1Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2. Maruti Suzuki Eeco:

ఇది స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక MPV. ఏప్రిల్ ప్రారంభంలో కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో దీన్ని అప్డేట్ చేసింది. దీని ధరను రూ. 25,500 పెంచింది. దీంతో ఈ కారు ఇప్పుడు రూ.5.69 లక్షల నుంచి రూ.6.95 లక్షల మధ్య అమ్ముడవుతోంది. దీనిలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 79bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ CNGపై 69bhp శక్తిని ప్రొవైడ్ చేస్తుంది.
1. Maruti Suzuki Alto K10:

6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీ ఫీచర్ అప్‌డేట్‌తో కంపెనీ ఈ కారు ధరను రూ.16,000 వరకు పెంచింది. అయినప్పటికీ 'మారుతి ఆల్టో K10' ఇప్పటికీ భారత్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న అత్యంత సరసమైన కారుగా ఉంది. ప్రస్తుతం ఇది రూ.4.23 లక్షల నుంచి రూ.6.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అమ్ముడవుతోంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 66bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది.
కొత్త కలర్ ఆప్షన్స్, ఫీచర్లతో 2025 TVS స్పోర్ట్ బైక్- టీజర్ చూశారా?
మార్స్‌పై జీవం ఉందా?- పుర్రె ఆకారంలో మిస్టీరియస్ నిర్మాణాన్ని గుర్తించిన నాసా రోవర్
ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం- నిప్పులు కక్కుతూ నేలకు జారనున్న ఉల్కలు!