Best Free VPN In 2025 : మీరు కోరుకున్న వెబ్‌సైట్‌లను చూడలేకపోతున్నారా? బ్లాక్స్, ఫైర్‌వాల్స్ వాటిని ఓపెన్ కాకుండా చేస్తున్నాయా? అయితే ఇది మీ కోసమే. వీపీఎన్‌లతో వాటిని చాలా సులువుగా ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు మీ వ్యక్తిగత సమాచారం సహా, మీ డేటా సురక్షితంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ 2025లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్రీ వీపీఎన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకూ వీపీఎన్ అంటే ఏమిటి?
వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇది మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, మీ ఐపీ అడ్రస్‌ను ఇతరులకు తెలియకుండా దాచిపెడుతుంది. అందువల్ల మీ ఆన్‌లైన్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలుగకుండా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా ఉంటుంది.
వీపీఎన్ ఎలా పని చేస్తుంది?
వీపీఎన్ అనేది మీ డివైజ్ (ఫోన్/ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్/ ట్యాబ్)కు, రిమోట్ సర్వర్‌కు మధ్య సురక్షితమైన కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది. ఈ కనెక్షన్ మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. అందుల్ల 'ఐఎస్‌పీ'తో సహా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ కూడా మీరు చూసే వెబ్‌సైట్స్‌ను, పంపే, స్వీకరించే డేటా వివరాలను కనిపెట్టలేవు.
వీపీఎన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
వీపీఎన్ మీ ఆన్‌లైన్ కార్యకలాపాలను ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచుతుంది. మీరు ఎవరో, ఎక్కడ నుంచి, ఏం బ్రౌజ్ చేస్తున్నారో ఇతరులు కనిపెట్టకుండా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా బ్లాక్‌లు, ఫైర్‌వాల్‌లను అధిగమించి, మీరు కోరుకున్న వెబ్‌సైట్‌లను చూడడానికి వీలుకల్పిస్తుంది.
మరి మీరు కూడా మంచి వీపీఎన్‌ను వాడాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ 2025లో పూర్తి ఉచితంగా లభిస్తున్న వీపీఎన్‌లను గురించి ఇప్పుడు చూద్దాం.
- Privado VPN Free : ఇది పూర్తిగా ఉచితం. విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ అన్నింటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. ఒక నెలలో గరిష్ఠంగా 10 జీబీ వరకు డేటా లిమిట్ ఉంటుంది. దీనికి 10 దేశాల సర్వస్ ఛాయిస్ ఉంటుంది. ఇప్పటి వరకు దీనిని ఎవరూ బ్రీచ్ చేయలేకపోయారు. కనుక మీ ఆన్‌లైన్ ప్రైవసీకి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. మీరు కావాలని అనుకుంటే దీని ప్రో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు కూడా.
- Proton VPN Free : ఈ వీపీఎన్ విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, లీనక్స్ అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది. దీనితో అన్‌లిమిటెడ్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. అంటే డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు. అయితే దీనికి సర్వస్ ఛాయిస్ ఉండదు. దీనిలో ప్రైవసీ, సెక్యూరిటీ, యూజర్ ప్రొటక్షన్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి.
- Windscribe Free : ఇది కూడా మ్యాక్, విండోస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, లైనక్స్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీని డేటా పరిమితి 10 జీబీ. ఎన్ని కనెక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. దీనిలో10 దేశాలకు చెందిన 14 సర్వర్ లొకేషన్లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని ఉపయోగించుకోవచ్చు.
- Hide.me Free VPN : విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, లీనక్స్, క్రోమ్, ఫైర్‌ఫాక్స్ అన్నింటిలోనూ దీనిని వాడుకోవచ్చు. దీని డేటా పరిమితి 10 జీబీ. ఇది 7 దేశాలు, 7 సర్వర్ లొకేషన్లలను కలిగి ఉంటుంది. అయితే దీనిని కొత్తవారు ఉపయోగించడం కాస్త క్లిష్టంగా ఉంటుంది.
- Hotspot Shield Basic VPN : డేటా లిమిట్ లేని బెస్ట్ వీపీఎన్ ఇది. విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, లీనక్స్, క్రోమ్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకే ఒక సర్వర్ లొకేషన్ కలిగి ఉంటుంది. కానీ ఇది మంచి యూజర్ ఫ్రెండ్లీ వీపీఎన్.
మీ ఆన్‌లైన్ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలా? ఈ 10 టిప్స్ ఫాలో అయితే చాలు!