Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అల్ట్రా-స్లిమ్ ఫ్లాగ్షిప్ ఫోన్ 'శాసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్' స్మార్ట్‌ఫోన్ మరికొన్ని గంటల్లో లాంఛ్ కానుంది. కంపెనీ దీన్ని మే 13, 2025న ఉదయం రిలీజ్ చేయనుంది. కంపెనీ ఈ ఇప్పటికే దాని డిజైన్, మందం, బరువు, కెమెరాను వెల్లడించింది. ఇక మిగిలిన ఫీచర్లకు సంబంధించిన వివరాలను రివీల్ చేసే ఈ ఫోన్ ఇమేజ్ కూడా లీక్ అయింది. ఇకపోతే రేపు యూట్యూబ్‌లో ఈ ఫోన్ లాంఛ్ కార్యక్రమాన్ని కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆ వివరాలు మీకోసం.
లాంఛ్ ప్రత్యక్షప్రసారం ఎక్కడ, ఎప్పుడు చూడాలి?: కంపెనీ ఈ ఫోన్ అధికారిక లాంఛ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 'Beyond Slim' పేరుతో మే 13, 2025న ఉదయం 5:30 గంటలకు IST (భారతీయ ప్రామాణిక సమయం) ప్రారంభించనుంది. ఈ లైవ్ వీడియో 'samsung.com' తో పాటు శాంసంగ్ అధికారిక 'YouTube' ఛానెల్ ద్వారా చూడొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు (అంచనా):
డిజైన్: ఈ ఫోన్ సుపరిచితమైన ప్రీమియం మెటల్ బిల్డ్‌తో ఆకట్టుకునేలా 5.85mm స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఇది 163g బరువుతో వస్తుంది. అయితే ఇది 'S25 అల్ట్రా' మోడల్ మాదిరిగా టైటానియం ఫ్రేమ్‌తో వస్తుందా లేదా 'S25', 'S25 ప్లస్' లాగా అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
డిస్‌ప్లే: ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ QHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని నివేదించారు. ఈ డివైజ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉందని కంపెనీ కన్ఫార్మ్ చేసింది.
చిప్సెట్: ఈ ఫోన్ మిగిలిన 'గెలాక్సీ S25' సిరీస్‌లో ఉన్న అదే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 12GB RAM, 256GB/512GB స్టోరేజీతో వస్తుంది.
కెమెరా సెటప్: వెనక కెమెరా సెటప్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. అయితే ఈ డివైజ్‌లో ప్రత్యేకమైన జూమ్ కెమెరా ఉండదు.
బ్యాటరీ: కంపెనీ 25W వైర్డు ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించే 3,900mAh బ్యాటరీతో దీన్ని లాంఛ్ చేయొచ్చు.
సాఫ్ట్వేర్: ఈ పరికరం బాక్స్ వెలుపల UI 7తో వస్తుంది. ఇది ఏడు సంవత్సరాల Android OS అప్డేట్లకు సపోర్ట్ చేస్తుంది.
ధర ఎంత ఉండొచ్చు?: స్పెసిఫికేషన్ల పరంగా ఈ ఫోన్ గెలాక్సీ S25, గెలాక్సీ S25 అల్ట్రా మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ధర విషయంలో కూడా అదేవిధంగా ఉండొచ్చు. కంపెనీ ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను దాదాపు రూ. 1,10,000గా నిర్ణయించే అవకాశం ఉంది.
త్వరలో మార్కెట్లోకి 'వివో వి50 ఎలైట్ ఎడిషన్'!- లాంఛ్‌కు ముందే కీలక స్పెక్స్ లీక్!!
ఈ-క్లచ్ సిస్టమ్‌తో హోండా మోటార్ సైకిల్స్ వచ్చేశాయోచ్- ధర ఎంతంటే?
రే-బాన్ గ్లాసెస్‌కు పోటీగా యాపిల్ స్మార్ట్‌గ్లాసెస్!- రిలీజ్ ఎప్పుడంటే?