Samsung Galaxy S25 Edge: దేశీయ మార్కెట్లోకి త్వరలోనే 'శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్' స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఈ వెబ్సైట్ ఇది త్వరలోనే దేశంలో లాంఛ్ అవుతుందని సూచిస్తుంది.
గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ అత్యంత సన్నని మోడల్‌ను జనవరిలో కంపెనీ తన 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' ఈవెంట్‌లో మొదట టీజ్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025)లో ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. ఈ గెలాక్సీ S25 ఎడ్జ్ మోడల్ ఇప్పటికే ఈ సిరీస్‌లో లాంఛ్ చేసిన ఇతర మూడు మోడళ్ల మాదిరిగానే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
BISలో చూసిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మోడల్ నంబర్: BIS వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ (via Xpertpick)లోని మోడల్ నంబర్ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ భారతీయ వేరియంట్ అని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ రీజనల్ అవైలబిలిటీని ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ భారతీయ నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ కనిపించడంతో అది త్వరలోనే భారత్‌లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి నివేదికల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఏప్రిల్ 16న గ్లోబల్ మార్కెట్లలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. లాంఛ్ అనంతరం అంటే ఒక నెల తర్వాత సేల్‌కి అందుబాటులోకి రావచ్చు. ఇది ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని, దీని ధర దాదాపు $999 (సుమారు రూ. 86,900) ఉండొచ్చని అంచనా.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు: ఈ అప్‌కమింగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' బ్యాటరీ ఇటీవల UK Demko వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇక ఈ హ్యాండ్‌సెట్ 3,900mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. చైనా 3C వెబ్‌సైట్‌లోని మరొక లిస్టింగ్‌లో ఈ ఫోన్.. బేస్ గెలాక్సీ S25 మోడల్ మాదిరిగా 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సూచిస్తుంది.
ప్రీవియస్ నివేదికలు ఈ 'గెలాక్సీ S25 ఎడ్జ్' క్వాల్‌కామ్ నుంచి గెలాక్సీ చిప్ కోసం కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా శక్తిని పొందుతుందని, 12GB RAMతో పాటు ఉంటుందని సూచిస్తున్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే One UI 7పై నడుస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ గెలాక్సీ AI ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుందని సమాచారం.
ఈ ఫోన్‌ను ఇటీవలే MWC 2025లో ప్రదర్శించడంతో ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని రివీల్ అయింది. ఇది 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.65-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, 5.84mm మందంతో గెలాక్సీ S25 లైనప్‌లో అత్యంత సన్నని మోడల్‌గా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
బడ్జెట్-ఫ్రెండ్లీగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వేరియంట్- రూ.80వేల కంటే తక్కువ ధరకే!
మస్క్ స్టార్‌లింక్‌తో జియో, ఎయిర్టెల్ డీల్- ఇకపై మారుమూల ప్రాంతాల్లోనూ హై-స్పీడ్ ఇంటర్నెట్!
అల్టిమేట్ ప్రాసెసర్, కొత్త ఓఎస్‌తో 'ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+'- ఈ ఫోన్‌తో మీరు మరింత 'స్మార్ట్'!