ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్ ప్రియులకు శుభవార్త- కేవలం రూ.7,999లకే శాంసంగ్ మొబైల్! - Samsung Galaxy M05 Launched

Samsung Galaxy M05 Launched: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్‌ గెలాక్సీ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. కేవలం 7,999 రూపాయలకే దీన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రండి.

author img

By ETV Bharat Tech Team

Published : Sep 16, 2024, 2:30 PM IST

Samsung_Galaxy_M05_Launched
Samsung_Galaxy_M05_Launched (Samsung)

Samsung Galaxy M05 Launched: ప్రస్తుతం స్మార్ట్​ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్​ఫోన్ల సేల్స్ పెరగటంతో ప్రముఖ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇండియాలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకుని సేల్స్ పెంచుకోవటంపై స్మార్ట్​ఫోన్ల కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ మరో సరికొత్త మొబైల్​ను మార్కెట్లో లాంచ్ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 పేరుతో అతి తక్కువ ధరలో దీన్ని తీసుకొచ్చింది. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా ఈ మొబైల్​ను కొనుగోలు చేయొచ్చు. మరెందుకు ఆలస్యం ఈ మొబైల్‌ ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy M05 Features:

  • డిస్​ప్లే: 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ
  • బ్యాటరీ: 5,000mAh
  • ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో జీ85
  • మెయిన్ కెమెరా: 50ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 8ఎంపీ
  • 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • ఛార్జర్‌: యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌
  • డ్యూయల్‌ నానో సిమ్‌కు సపోర్ట్‌

శాంసంగ్ గెలాక్సీ M05 వేరియంట్స్​: శాంసంగ్ కొత్త ఫోన్‌ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

  • 4జీబీ+ 64జీబీ వేరియంట్‌

శాంసంగ్ గెలాక్సీ M05లో కలర్ ఆప్షన్స్​:

  • మింట్‌ గ్రీన్‌
  • ధర: రూ.7,999

శాంసంగ్ గెలాక్సీ M05 ఫోన్ కేవలం ఒక వేరియంట్​లో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా శాంసంగ్ కంపెనీ నిర్ణయించింది. ఇది 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐతో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ నానో సిమ్​కు సపోర్ట్ చేస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డ్‌ సాయంతో 1టీబీ వరకు దీని స్టోరేజ్‌ పెంచుకొనే సదుపాయం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్ 3.5ఎంఎం హెచ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అయితే ఈ మొబైల్ కేవలం 4G నెట్​వర్క్​కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

వరల్డ్ ఫస్ట్ ట్రై ఫోల్డ్ మొబైల్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - First Tri Foldable Smartphone

యాపిల్‌ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్ 16 సిరీస్​- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.