Redmi A5 Launched in India: రెడ్మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ 'రెడ్మీ A5' పేరుతో దీన్ని దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 6,499 ధరతో ప్రారంభమయ్యే ఈ ఫోన్ UNISOC T7250 చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్, 32-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుంది.
రెడ్మీ A5 వేరియంట్స్: ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 3GB + 64GB స్టోరేజ్
- 4GB + 128GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా ధరలు:
- 3GB + 64GB స్టోరేజ్‌తో దీని ధర: రూ. 6,499
- 4GB + 128GB స్టోరేజ్‌తో దీని ధర: రూ. 7,499
సేల్ డీటెయిల్స్: ఈ ఫోన్ ఏప్రిల్ 16 నుంచి Flipkart, mi.com, అధికారిక Xiaomi రిటైల్ భాగస్వాములు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
1 DAY LEFT! Tomorrow, the REDMI A5 will be here to prove that great tech doesn’t have to come with a high price tag. 🏷️
— Xiaomi Nigeria (@XiaomiNigeria) April 15, 2025
Are you ready to grab yours? 💸#RedmiA5 #1DayToGo pic.twitter.com/1D9KPnmm6P
Redmi A5 ఫీచర్లు: ఇది 6.88-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz. ఈ ఫోన్‌లో 1.8GHz ఆక్టా-కోర్ UNISOC T7250 ప్రాసెసర్, Mali-G57 MP1 GPU ఉన్నాయి. ఇది 3GB, 4GB LPDDR4X RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఇది మీడియా, ఫైల్‌లకు తగినంత స్పేస్‌ను అందిస్తుంది.
బ్యాటరీ: ఈ ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది USB టైప్-C ద్వారా 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది రోజువారీ ఉపయోగం కోసం లాంగ్-లాస్టింగ్ పెర్ఫార్మెన్స్నుఅందిస్తుంది. 193 గ్రాముల బరువు, 8.26mm మందం కలిగిన ఈ ఫోన్ స్ట్రాంగ్ నిర్మాణంతో కంఫర్టబుల్ బ్యాలన్స్‌ను అందిస్తుంది.
కెమెరా సెటప్: ఫొటోగ్రఫీ కోసం ఇది 32-మెగాపిక్సెల్ వెనక కెమెరా (f/2.0 ఎపర్చరు) కలిగి ఉంది. ఇది సెకండరీ సెన్సార్, LED ఫ్లాష్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ లేటెస్ట్ Android 15 పై నడుస్తుంది. ఇది మెరుగైన ఫీచర్లు, సెక్యూరిటీతో ఆధునిక సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లు: కనెక్టివిటీ కోసం ఇది డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2తో పాటు GPS, GLONASS, గెలీలియో, BDS ద్వారా గ్లోబల్ నావిగేషన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. వీటితో పాటు దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో సపోర్ట్ ఉన్నాయి.
ఏసర్ నుంచి తొలిసారిగా స్మార్ట్ఫోన్లు- బడ్జెట్ ధరలోనే కిర్రాక్ ఫీచర్లు!
హీరో 'సూపర్ స్ప్లెండర్ Xtec', 'గ్లామర్' బైక్స్ అప్డేట్- ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా?
మంచి ఫ్యామిలీ కారు కొనాలా?- ఏడు సీట్లతో తోపు ఇవే!- కొనే ఆలోచన ఉంటే ఓ లుక్కేయండి!