Realme Narzo 80 Lite 5G: రియల్మీ 'నార్జో 80 లైట్ 5G' త్వరలో భారతదేశంలో లాంఛ్ కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని టీజర్లను రిలీజ్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ అప్‌కమింగ్ ఫోన్ కచ్చితమైన లాంఛ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ బ్యాటరీతో పాటు ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్‌ను వెల్లడించింది. దీనితో పాటు కంపెనీ ఫోన్ ధర రేంజ్ గురించి కూడా హింట్ ఇచ్చింది. ఈ రియల్మీ ఫోన్‌పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
రియల్మీ నార్జో 80 లైట్ 5G టైమ్‌లైన్: రియల్మీ ఏప్రిల్ 2025లో 'నార్జో 80x', 'నార్జో 80 ప్రో' మోడల్స్‌ను ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను అంటే రియల్మీ 'నార్జో 80 లైట్ 5G'ని లాంఛ్ చేయబోతోంది. ఇది 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జ్‌తో 15.7 గంటలు యూట్యూబ్ చూడటం, 46.6 గంటల కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకోవటం కోసం ఉపయోగించవచ్చని పేర్కొంది. ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని వెల్లడించింది.
ఈ ఫోన్ కోసం అమెజాన్‌లో ఒక ప్రత్యేక మైక్రోసైట్ కూడా విడుదల చేశారు. దీని ప్రకారం ఈ ఫోన్ మందం 7.94mm ఉంటుంది. ఫోన్ వెనక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది రెండు సెన్సార్లు, ఒక ఎలిప్టికల్ LED ఫ్లాష్ లైట్‌తో వస్తుంది. ఈ ఫోన్ కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఇవ్వనున్నారు. దీనితో పాటు ఈ ఫోన్ ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
కలర్ ఆప్షన్స్: రియల్మీ ఈ ఫోన్‌ను బ్లాక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో టీజ్ చేసింది.
ఇకపోతే ఈ ఫోన్‌పై లీకైన సమాచారం ప్రకారం.. కంపెనీ దీన్ని రెండు వేరియంట్లలో లాంఛ్ చేయొచ్చు. మొదటి వేరియంట్ 4GB + 128GB స్టోరేజ్, దీని ధర రూ. 9,999. అదే సమయంలో రెండవ వేరియంట్ 6GB + 128GB స్టోరేజ్. దీని ధర రూ. 11,999గా ఉంటుంది.
'హీరో జూమ్ 160' బుకింగ్స్ మళ్లీ స్టార్ట్- డెలివరీలు ఎప్పుడంటే?
ఇవాళే యాపిల్ వార్షిక ఈవెంట్- ప్రత్యక్షప్రసారం చూడండిలా!
6,000mAh బ్యాటరీతో ఐకూ కొత్త 5G ఫోన్!- రూ.10వేల లోపు ధరలో ఇదే మొదటిది!!