ETV Bharat / technology

రియల్​మీ స్పెషల్ ఎడిషన్ చూశారా?- అద్భుతమైన డిజైన్​లో ఏం ఉంది భయ్యా!

భారత మార్కెట్లోకి రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌- ధర ఎంతంటే?

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched in India
Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched in India (Photo Credit- Realme)
author img

By ETV Bharat Tech Team

Published : October 9, 2025 at 4:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: చైనీస్ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత్​కు స్పెషల్ ఎడిషన్​ను తీసుకొచ్చింది. దీన్ని "రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్" పేరుతో తీసుకొచ్చారు. ఇది లిమిటెడ్ ఎడిషన్‌. అంటే దీన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. అయితే ఎన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే కంపెనీ ఇటీవలే జులై 2025లో "రియల్​మీ 15 ప్రో 5G" స్మార్ట్​ఫోన్​ను తీసుకురాగా, ఇప్పుడు దీనిలో ఈ స్పెషల్ ఎడిషన్​ను లాంఛ్ చేసింది.

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దాని బ్యాక్ ప్యానెల్ డిజైన్. ఇది బ్లాక్, గోల్డెన్​ కలర్​లో ఆకర్షణీయమైన లుక్​లో కన్పిస్తోంది. దీని కెమెరా ఐల్యాండ్​లో 3D-ఎన్​గ్రేవ్డ్ డ్రాగన్ క్లా బోర్డర్, స్టైలిష్ నానో-ఎన్‌గ్రేవ్డ్ మోటిఫ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండగా వాటి చుట్టూ గోల్డెన్ లెన్స్ రింగులతో ప్రత్యేకంగా డెకరేట్ చేశారు. వీటికి దిగువన గేమ్​ ఆఫ్​ థ్రోన్స్ షో హౌస్‌ టార్గారియన్‌ సింబల్‌ ఉంది. ఇది మూడు తలల డ్రాగన్‌ను సూచిస్తుంది.

ఈ లిమిటెడ్ ఎడిషన్ కలర్-ఛేంజింగ్ లెదర్ బ్యాక్ ప్యానెల్​ను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. 42 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద దీని రంగులో మార్పులు గమనించవచ్చని పేర్కొంది. అంటే సాధారణంగా దీని బ్యాక్ ప్యానెల్ బ్లాక్​ కలర్​లో కన్పిస్తుంది. అయితే ఉష్ణోగ్రతలో మార్పు వలన ఇది మండుతున్న ఎరుపు (Fiery Red) రంగులోకి మారుతుంది.

కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్​ను రెండు UI థీమ్స్​లో ప్రవేశపెట్టింది. కస్టమర్లు దీన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ (GOT) ఇన్​స్పైర్ట్డ్ స్టాక్ ఐస్​ లేదా Targaryen డ్రాగన్​ఫైర్‌ UI థీమ్​లో ఎంచుకోవచ్చు. అంతేకాక గేమ్ ఆఫ్‌ థ్రోన్స్‌ వాల్‌పేపర్స్‌తో పాటు ఐకాన్స్‌ను కూడా పొందవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: రియల్​మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

డిస్​ప్లే: ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 6,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్​ను అందిస్తుంది. దీని డిస్​ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్​తో వస్తుంది.

చిప్​సెట్: ఈ ఫోన్​లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. ఇది 12GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.

బ్యాటరీ: ఇందులో బిగ్ 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్​కు సపోర్ట్‌ చేస్తుంది.

కెమెరా సెటప్: ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX896 OIS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 50MP మల్టీస్పెక్ట్రల్ సెన్సార్‌ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఈ లిమిటెడ్ ఎడిషన్​లో​ 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను అమర్చారు.

రెసిస్టెన్సీ: ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66+IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.

FeaturesDetails
DesignExclusive black and gold colours
3D engraved Dragon Claw border on camera island
Golden decorative lens rings on rear cameras
The sigil of House Targaryen
Colour-changing leather back panel
Display144Hz | 6.8-inch 1.5K AMOLED
ProcessorSnapdragon 7 Gen 4
Rear camera50MP + 50MP ultrawide + 50MP multispectral sensor
Front camera50MP
Battery7,000mAh
Charging capacity80W
UI ThemeGame of Thrones inspired Stack “Ice” UI theme with cool tones
Targaryen “Dragonfire” UI theme with fiery hues

ధర ఎంతంటే?: రియల్​మీ ఈ స్పెషల్ ఎడిషన్​ను సింగిల్ 12GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో తీసుకువచ్చింది. దీని ధరను రూ.44,999గా నిర్ణయించింది.

సేల్ వివరాలు: ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, భారతదేశం అంతటా అధీకృత రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఆఫర్లు: వినియోగదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3,000 ఇన్​స్టంట్ డిస్కౌంట్​ను పొందవచ్చు. ఈ ఆఫర్​తో దీని ధర రూ.41,999కి చేరుకుంటుంది.

ConfigurationPriceEffective PriceInstant Discount
12GB RAM + 512GB storageRs 44,999Rs 41,999Rs 3,000 (instant discount on select credit card transactions)