Realme 14T 5G: రియల్మీ నుంచి కొత్త ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ 'రియల్మీ 14T 5G' పేరుతో దీన్ని ఏప్రిల్ 25, 2025న లాంఛ్ చేసేందుకు రెడీ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, లాంగ్-లాస్టింగ్ బ్యాటరీతో వస్తుంది. రిలీజ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, realme.comలో అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
డిస్‌ప్లే: ఈ ఫోన్ 2100 nits పీక్ బ్రైట్‌నెస్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అవుట్-డోర్ లైటింగ్‌లో కూడా స్పష్టమైన వ్యూయింగ్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 111% DCI-P3 కలర్ గమట్‌కు సపోర్ట్ చేస్తుంది. TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్‌ను కలిగి ఉంది. ఇది స్క్రీన్‌ను ఎక్కువసేపు వాడేటప్పుడు లేదా నైట్‌టైమ్ చూసేటప్పుడు కంటిపై ఒత్తిడిని (eye strain) తగ్గిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: ఈ 'రియల్మీ 14T 5G' ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాటరీ 17 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 12.5 గంటల గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది.
కెమెరా అండ్ ఆడియో: ఈ ఫోన్‌లో 50MP AI మెయిన్ కెమెరా ఉంది. దీన్ని రోజువారీ ఫొటోగ్రఫీ కోసం రూపొందించారు. ఆడియో కోసం రియల్మీ 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను జోడించారు. ఇది మీడియా, కాల్స్ లేదా నాయిసీ ఎన్విరాన్‌మెంట్స్‌లో స్పీకర్ వాల్యూమ్‌ను పెంచుతుంది.
డిజైన్: ఈ ఫోన్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఈ ధర రేంజ్‌లోని ఫోన్‌లలో చాలా అరుదు. దీంతోపాటు ఇందులో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ 7.97mm మాత్రమే థిక్‌నెస్‌ను కలిగి ఉంది.
realme 14T launching on April 25th in India.
— Mukul Sharma (@stufflistings) April 17, 2025
- Segment's brightest AMOLED (2100 nits peak brightness)
- 111% DCI-P3 wide color gamut
- 6000mAh battery
- 45W fast charging
- 50MP main camera
- IP69 rating
- Silken Green, Violet Grace, Satin Ink
- 300% Ultra Volume Mode pic.twitter.com/HAwJpqWSZm
కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో కాంతిని సూక్ష్మంగా ప్రతిబింబించే శాటిన్-ఫినిష్ టెక్చర్‌తో లభిస్తుంది.
- సిల్కెన్ గ్రీన్
- వైలెట్ గ్రే
- శాటిన్ ఇంక్
ధర, సేల్ వివరాలు: కంపెనీ ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. దీని సేల్ వివరాలను కూడా లాంఛ్ తేదీన ప్రకటించనున్నారు.
వాట్సాప్‌లో కొత్త ఫీచర్- ఇకపై స్టేటస్‌లో 90సెకన్ల వీడియోలు అప్లోడ్ చేయొచ్చు!
మోటరోలా నుంచి కొత్త ప్రొడక్ట్‌లు- కిర్రాక్ ఫీచర్లతో 'ప్యాడ్ 60 ప్రో', 'బుక్ 60'!
ఓపెన్ఏఐ నుంచి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్!- 'ఎక్స్'కు గట్టి పోటీ ఇవ్వనుందా?