New Feature for Whatsapp Status: వాట్సాప్ యూజర్లకు అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇకపై మీరు వాట్సాప్‌లో స్టేటస్‌ను మరింత పెద్దదిగా పెట్టుకోవచ్చు. ఈ తరహాలో వాట్సాప్ తన స్టేటస్ అప్డేట్‌ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు వినియోగదారులు తమ స్టేటస్‌కు 90 సెకన్ల నిడివి గల వీడియోలను అప్లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. దీంతో ఇకపై పొడవైన వీడియో కంటెంట్‌ను ఇకపై ముక్కలుగా విభజించాల్సిన అవసరం ఉండదు. దీనితోపాటు వాట్సాప్ త్వరలో 'అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ' ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది యూజర్లకు తమ చాట్స్ గోప్యతపై మరింత నియంత్రణను ఇస్తుంది. ఈ ఫీచర్‌పై సమాచారాన్ని WABetaInfo షేర్ చేసింది.
ఇకపై 90 సెకన్ల వరకు వీడియో స్టేటస్: WABetaInfo ప్రకారం ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 2.25.12.9 కోసం వాట్సాప్ బీటాలో గుర్తించారు. ఈ ఫీచర్‌తో ఇంతకు ముందు ఉన్న వీడియో స్టేటస్ లిమిట్‌ను 60 సెకన్ల నుంచి 90 సెకన్లకు పెంచారు. అంటే వినియోగదారులు ఇప్పుడు దాదాపు ఒకటిన్నర నిమిషాల వరకు వీడియోను స్టేటస్‌లో షేర్ చేసుకోవచ్చు.
📝 WhatsApp beta for Android 2.25.12.9: what's new?
— WABetaInfo (@WABetaInfo) April 14, 2025
WhatsApp is rolling out a feature to share video status updates up to 90 seconds long, and it's available to some beta testers!
Some users can get this feature by installing certain previous updates.https://t.co/qff05DwuZJ pic.twitter.com/mWl8vRsESO
గతేడాది కంపెనీ వీడియో స్టేటస్ పరిమితిని 30 సెకన్ల నుంచి 60 సెకన్లకు పెంచింది. ఇప్పుడు ఈ లిమిట్‌ను 90 సెకన్లకు పెంచుతూ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. Wabetainfo ఈ ఫీచర్‌పై స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. బీటా వినియోగదారులు 90 సెకన్ల వీడియో స్టేటస్‌ను అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు. వీడియో సక్సెస్‌ఫుల్‌గా అప్లోడ్ అయితే ఈ ఫీచర్ డివైజ్‌లో యాక్టివేట్ అయినట్లు, లేకుంటే ఈ ఫీచర్ కోసం ఇంకొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఈ ఫీచర్ అవైలబిలిటీపై వాట్సాప్ నుంచి మెసెజ్‌ల ద్వారా నోటిఫికేషన్లను అందుకుంటున్నారు. ఈ బీటా టెస్ట్ పూర్తయిన తర్వాత ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్‌లోని అందరికీ అందుబాటులోకి వస్తుంది.
📝 WhatsApp beta for Android 2.25.12.21: what's new?
— WABetaInfo (@WABetaInfo) April 16, 2025
WhatsApp is working on a feature to manage the advanced chat privacy option, and it will be available in a future update!https://t.co/5AZJlhFTGE pic.twitter.com/6m6vCplpbq
అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఫీచర్: చాట్ గోప్యత కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.25.12.21 కోసం వాట్సాప్ బీటాలో కనిపించింది. ఈ ఫీచర్ వినియోగదారులను అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్స్‌ను మేనేజ్ చేసేందుకు అనుమతిస్తుంది. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఆన్-ఆఫ్ టోగుల్‌తో ఈ ఆప్షన్ కన్పిస్తుంది. ఈ ఫీచర్‌తో ఇంతకుముందులా యాక్టివేటెడ్ చాట్స్ నుంచి ఇమేజ్‌లు, వీడియోలు వంటి మీడియా ఫైల్స్ డివైజ్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అలాగే అటువంటి చాట్స్ మొత్తం హిస్టరీని ఎక్స్పోర్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్స్‌కు ఆప్షనల్ అవుతుంది.
ఓపెన్ఏఐ నుంచి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్!- 'ఎక్స్'కు గట్టి పోటీ ఇవ్వనుందా?
హైవేపై ఆగాల్సిన అవసరం లేదిక!- కొత్త టోల్ పాలసీతో మీ జర్నీకి నో బ్రేక్స్!
బ్లాక్ కలర్ వావ్.. స్టన్నింగ్ లుక్‌లో డార్క్ ఎడిషన్ కార్లు- వీటిని చూస్తే కొనకుండా ఉండగలరా..??