ETV Bharat / technology

ఐఫోన్​ల కోసం కొత్త AI వాయిస్ అసిస్టెంట్- 'సిరి'తో పనిలేదిక! - PERPLEXITY AI IOS VOICE ASSISTANT

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్- డివైజ్​లలో కొత్త AI వాయిస్ అసిస్టెంట్- వీడియో ప్లే, రైడ్ బుకింగ్స్​తో పాటు మరెన్నో..!

Perplexity AI Launches Voice Assistant for iPhones
Perplexity AI Launches Voice Assistant for iPhones (Photo Credit- Perplexity)
author img

By ETV Bharat Tech Team

Published : April 28, 2025 at 10:40 AM IST

2 Min Read

Perplexity AI iOS Voice Assistant: పర్‌ప్లెక్సిటీ AI ఐఫోన్‌ల కోసం సరికొత్త వాయిస్ అసిస్టెంట్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు రిజర్వేషన్‌లు, ఇమెయిల్‌లు, మీడియా ప్లేతో పాటు రైడ్ బుకింగ్ వంటి పనుల్లో సహాయపడుతుంది. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

పర్‌ప్లెక్సిటీ iOS వాయిస్ అసిస్టెంట్: పర్‌ప్లెక్సిటీ AI ఐఫోన్‌ల కోసం 'పర్‌ప్లెక్సిటీ iOS వాయిస్ అసిస్టెంట్' అనే AI-ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌ను విడుదల చేసింది. ఇది పర్‌ప్లెక్సిటీ యాప్ లోపల వచ్చే కొత్త వాయిస్ అసిస్టెంట్. పర్‌ప్లెక్సిటీ యాప్ ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ వాయిస్ అసిస్టెంట్‌ను జనవరి 2025లో ఆండ్రాయిడ్ డివైజ్​ల కోసం ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత దీన్ని iOS పరికరాల కోసం కూడా ప్రారంభించారు.

దీనిపై పర్‌ప్లెక్సిటీ AI తన సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్ 'X'లో ఒక వీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం.. ఇది ఐఫోన్‌లకు కొత్త వాయిస్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది వెబ్ బ్రౌజింగ్, మల్టి-యాప్ యాక్షన్​ల ద్వారా వివిధ రకాల పనులను నిర్వహిస్తుంది. అంటే రిజర్వేషన్‌లను బుకింగ్ చేయడం, ఇమెయిల్‌లను పంపడం, క్యాలెండర్ ఇన్వైట్స్ పంపడం, పర్‌ప్లెక్సిటీ iOS యాప్ నుంచి మీడియా ఫైల్‌లను ప్లే చేయడం వంటి పనుల్లో ఇది సహాయపడుతుంది.

కొత్త వాయిస్ అసిస్టెంట్ ప్రయోజనాలు: పైన పేర్కొన్నవాటితో పాటు ఈ యాప్ ఐఫోన్‌లో పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలు, ఇతర మీడియా కంటెంట్‌ను సెర్చ్ చేసి ప్లే చేయగలదని ఈ AI కంపెనీ మరొక పోస్ట్‌లో తెలిపింది. ఇది కాకుండా పర్‌ప్లెక్సిటీ iOS వాయిస్ అసిస్టెంట్​ ద్వారా ఐఫోన్‌లో వివరాలను సెర్చ్ చేయడం, ఇమెయిల్‌లను డ్రాఫ్ట్ చేయడం, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులో రైడ్‌ను బుక్ చేయడం వంటివి సులభంగా చేసుకోవచ్చు. అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ అయిన సిరిలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ రెస్టారెంట్లలో రిజర్వేషన్లను బుక్ చేసుకోవడం వంటి కొన్ని ఫీచర్లు ఇంకా సిరిలో అందుబాటులో లేవు.

iOS యాప్‌లలో పర్‌ప్లెక్సిటీని ఎలా ఉపయోగించాలి?:

  • ఇందుకోసం ముందుగా మీ iPhoneలో Perplexity యాప్​ను ఓపెన్ చేయండి.
  • ఇన్‌పుట్ బాక్స్‌లోని వాయిస్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  • ఇప్పుడు మీకు కావాల్సిన వాటి గురించి వివరాలను ఈ వాయిస్ అసిస్టెంట్​ను అడగొచ్చు.

యాక్షన్ బటన్‌ను ఉపయోగించాలా?:

  • దీని కోసం మీ ఫోన్‌లో 'సెట్టింగ్స్'​ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేసి 'యాక్షన్ బటన్‌'పై ట్యాప్ చేయండి.
  • తర్వాత అక్కడ అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి షార్ట్​కట్​ ఆప్షన్​లను ఎంచుకోండి.
  • ఇప్పుడు అందుబాటులో ఉన్న యాప్స్ లిస్ట్ నుంచి పర్‌ప్లెక్సిటీ యాప్‌ను సెలెక్ట్ చేసుకోండి.
  • అనంతరం స్టార్ట్ వాయిస్ కాన్వర్జేషన్ ఆప్షన్​ను ఎంచుకోండి.

అంతే ఇలా సింపుల్​గా పర్‌ప్లెక్సిటీ AI సెట్టింగ్‌లను యాక్షన్ బటన్‌కు సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని యాక్షన్ బటన్​పై క్లిక్ చేయడం ద్వారా పర్‌ప్లెక్సిటీ iOS వాయిస్ అసిస్టెంట్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.

ఇక అమెరికాలో అన్నీ మన ఐఫోన్​లే!- భారత్​లోనే మొత్తం తయారీ.. యాపిల్ స్కెచ్ మామూలుగా లేదుగా!

BMW నుంచి హై-టెక్ టూరింగ్ బైక్- దీని పవర్‌ ముందు కారు కూడా బలాదూర్‌!

6,000mAh బ్యాటరీతో 'రియల్​మీ 14T 5G' ఫోన్ లాంఛ్- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.